IPL 2022: న్యూజిలాండ్ బయలుదేరిన సన్‌రైజర్స్ కెప్టెన్ Kane మామ..

ABN , First Publish Date - 2022-05-18T21:25:13+05:30 IST

హైదరాబాద్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) కెప్టెన్ కేన్ విలియమ్సన్ బయో-బబుల్ నుంచి బయటకొచ్చాడు.

IPL 2022: న్యూజిలాండ్ బయలుదేరిన సన్‌రైజర్స్ కెప్టెన్ Kane మామ..

హైదరాబాద్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) కెప్టెన్ కేన్ విలియమ్సన్ బయో-బబుల్ నుంచి బయటకొచ్చాడు. తన భార్య రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్న ఈ కీలక సమయంలో తోడుగా ఉండేందుకు న్యూజిలాండ్ బయలుదేరాడు. తమ కుటుంబంలోకి మరో బుల్లి వ్యక్తి అడుగెట్టబోతున్న ఈ మధుర క్షణాలను ఆస్వాదించాలని విలియమ్సన్ నిర్ణయించుకున్నాడని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం ట్విటర్ వేదికగా అఫీషియల్‌గా ప్రకటించింది. అత్యంత కీలకమైన ఈ సమయంలో భార్యకు తోడుగా ఉండాలని భావించాడని స్పష్టం చేసింది. మిగతా జట్టు సభ్యులందరూ రైజర్స్ క్యాంప్‌లోనే ఉన్నారు. కేన్ భార్య సురక్షితంగా ప్రసవించాలని, వారి కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలని జట్టుసభ్యులందరూ ఆకాంక్షిస్తున్నారని తెలిపింది.


గత రాత్రి(మంగళవారం) ముంబై ఇండియన్స్‌పై మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కేన్ విలియమ్సన్ నాయకత్వం వహించాడు. అతడి గైర్హాజరీ నేపథ్యంలో లీగ్‌లో చివరి మ్యాచ్‌కు ఎవరు నాయకత్వం వహిస్తారనేది ఆసక్తికరంగా మారింది. గతంలో ఇలాంటి సందర్భంగా ఎదురైనప్పుడు భువనేశ్వర్ కుమార్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.


కాగా గతరాత్రి ముంబైపై మ్యాచ్ఎ స్‌ఆర్‌హెచ్ 3 పరుగుల తేడాతో ముంబైపై గెలుపొందింది. ఈ గెలుపుతో హైదరాబాద్ ప్లే ఆఫ్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. కాగా IPl2022 సీజన్‌లో కేన్ విలియమ్సన్ మొత్తం 13 మ్యాచ్‌లు ఆడాడు. అయితే బ్యాటింగ్‌లో తన సత్తాకు తగ్గట్టు రాణించలేకపోయాడు. మొత్తం 216 పరుగులు మాత్రమే నమోదు చేయగా స్ట్రైక్ రేటు 93.51గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ 8వ స్థానంలో ఉంది. 13 మ్యాచ్‌లు ఆడి 6 విజయాలతో 12 పాయింట్లను కలిగివుంది. చివరిగా మిగిలివున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై మే 22న తలపడనుంది.

Updated Date - 2022-05-18T21:25:13+05:30 IST