Advertisement

నేనంటే భయం: ట్విట్టర్‌ సీఈఓపై కంగనా ఆసక్తికర ట్వీట్‌

Feb 27 2021 @ 22:54PM

విభిన్న పాత్రలను ఎంచుకుంటూ హీరోయిన్‌గా బాలీవుడ్‌లో ఎలా అయితే టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అవుతుందో.. వివాదాలతోనూ అంతే హాట్‌ టాపిక్‌గా నిలుస్తుంది కంగనా రనౌత్‌. రెండు పడవల మీద ప్రయాణం అనేలా.. అటు సినిమాలతోనూ, ఇటు వివాదాలతోనూ ఆమె పయనిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే.. ఆమె సినిమాలపై ఇంట్రెస్ట్ పెంచేది కూడా ఆమె వివాదాలే. ఒకవైపు హృతిక్‌ రోషన్‌తో జరుగుతున్న వివాదం కోర్టులో ఉండగా.. ఇప్పుడు ట్విట్టర్‌ని టార్గెట్‌ చేస్తూ.. ఆమె సంధించే అస్త్రాలు ట్రెండ్‌ అవుతున్నాయి. తన ట్వీట్లపై ఆమె చట్టపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కొంటోంది. అయితే ఆమెను తట్టుకోలేక ట్విట్టర్‌ ఇండియా కంగనా ఖాతాను షాడోబ్యాన్‌ చేసినట్లు కూడా ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆగ్రహానికి లోనైన కంగనా.. డైరెక్ట్‌గా ట్విట్టర్‌ సీఈఓపై ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది.

 

ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీని 'జాక్‌ చాచా' అని సంబోధిస్తూ.. భావ వ్యక్తికరణ చేసినందుకు నా ఖాతాను షాడోబ్యాన్‌ చేశారు.. జాక్‌ అండ్‌ అతని బృందం. వారు నన్ను చూసి భయపడుతున్నారు. వారు నన్ను బ్యాన్‌ చేయలేరు.. అలాగని నన్ను ఉంచడానికి అనుమతించలేరు. అయినా నేను ఫాలోయర్స్‌ని పెంచుకోవడానికో.. నన్ను నేను ప్రమోట్‌ చేసుకోవడానికో ఇక్కడ లేను. నేను ఏది మాట్లాడినా అది దేశం కోసమే. దాన్ని వారు సహించలేకపోతున్నారు.. అని కంగనా తన ట్వీట్‌లో పేర్కొంది. ట్విట్టర్‌ సీఈఓని కంగనా టార్గెట్‌ చేయడం ఇప్పటిది కాదు.. ఎప్పటి నుంచో ఆమె ఇలా యుద్ధం చేస్తూనే ఉంది.

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.