కొత్త కారు కొన్న Kangana Ranaut.. ధర వింటే షాక్ అవ్వాల్సిందే..

Published: Fri, 20 May 2022 16:46:22 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కొత్త కారు కొన్న Kangana Ranaut.. ధర వింటే షాక్ అవ్వాల్సిందే..

బాలీవుడ్‌లోని స్టార్ హీరోయిన్స్‌లో కంగనా రనౌత్ ఒకరు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా నటించిన చిత్రం ‘ధాకడ్’. ఈ మూవీ మే 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే.. ఈ సినిమా రిలీజ్‌కి ఒక రోజు ముందు ఈ భామ కారు కొంది. ఈ కారు ధర గురించి ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతోంది.


కంగనా తాజాగా Mercedes-Maybach S680 కారుని కొనుగోలు చేసింది. ఈ కారు ధర దాదాపు రూ.3.5 కోట్లు ఉంటుందట. అంతేకాకుండా ఇంత ఖరీదైన లగ్జరీ సెడాన్ కారుని కొన్న మొదటి ఇండియన్ ఈ నటేనట. దీంతో ఈ కారు ధర గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే.. ఈ భామకి 2019లో ఆమె మెర్సిడెస్-బెంజ్  GLE SUVని కొనుగోలు చేయగా.. తాజాగా ఇంత ధర పెట్టి ఈ కారుని సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ కారు డిలివరీ  తీసుకోవడానికి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోని ఓ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా వైరల్‌గా మారింది. అయితే.. ప్రముఖ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్, కంగన కంటే ముందే ఈ కారు ఎస్ సిరీస్‌లోని Mercedes Maybach S580ని రూ.2.5 కోట్లకి కోనుగోలు చేశాడు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International