Pet Kangaroo: పెంచుకున్న కంగారూ వృద్ధుడి ప్రాణం తీసింది...ఆపై

ABN , First Publish Date - 2022-09-13T17:04:15+05:30 IST

తాను ప్రేమతో పెంచుకున్న కంగారూ(Pet Kangaroo) యజమాని అయిన 77 ఏళ్ల వృద్ధుడిని(Old Man) చంపిన ఘటన...

Pet Kangaroo: పెంచుకున్న కంగారూ వృద్ధుడి ప్రాణం తీసింది...ఆపై

మెల్‌బోర్న్(ఆస్ట్రేలియా): తాను ప్రేమతో పెంచుకున్న కంగారూ(Pet Kangaroo) యజమాని అయిన 77 ఏళ్ల వృద్ధుడిని(Old Man) చంపిన ఘటన ఆస్ట్రేలియా(Australia) దేశంలో తాజాగా వెలుగుచూసింది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని తక్కువ జనాభా ఉన్న దక్షిణ పట్టణం రెడ్‌మండ్‌లోని ఒక ఇంట్లో తీవ్రమైన గాయాలతో పడి ఉన్న వృద్ధుడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరణించిన వ్యక్తి ముందు రోజు కంగారూ దాడికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించేందుకు అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది. 


అక్కడ ఇంట్లో కంగారూ ఉండటంతో మృతదేహం వద్దకు రావాలంటే కంగారూ అడ్డుగా ఉంది. దీంతో కంగారూను పోలీసులు కాల్చి చంపవలసి వచ్చింది. కంగారూను మనిషి పెంచుకుంటుండగా అది యజమానిని చంపిందని పోలీసులు తెలిపారు.1936లో ఓ కంగారూ చివరిసారిగా ఓ మనిషిపై దాడి చేసి చంపింది.



Updated Date - 2022-09-13T17:04:15+05:30 IST