పార్టీ కార్యక్రమాల్లో కనిగిరికి ప్రత్యేక స్థానం

ABN , First Publish Date - 2022-06-26T05:18:28+05:30 IST

టీడీపి కార్యక్రమాలు నిర్వహణలో రాష్ట్రంలోనే కనిగిరికి ప్రత్యేక స్థానం ఉందని, ఆ పేరు రావడానికి పార్టీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి కార్యదక్షతే కారణమని పార్టీ నియోజకవర్గ పరిశీలకులు గంగోడు నాగేశ్వరరావు అన్నారు.

పార్టీ కార్యక్రమాల్లో కనిగిరికి ప్రత్యేక స్థానం
మాట్లాడుతున్న టీడీపీ పరిశీలకులు నాగేశ్వరరావు, పాల్గొన్న ఇన్‌చార్జి ఉగ్ర

టీడీపీ పరిశీలకుడు నాగేశ్వరరావు

కనిగిరి, జూన్‌ 25 : టీడీపి కార్యక్రమాలు నిర్వహణలో రాష్ట్రంలోనే కనిగిరికి ప్రత్యేక స్థానం ఉందని, ఆ పేరు రావడానికి పార్టీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి కార్యదక్షతే కారణమని పార్టీ నియోజకవర్గ పరిశీలకులు గంగోడు నాగేశ్వరరావు అన్నారు. స్థానిక కా ర్యాలయంలో శనివారం జరిగిన నియోజకవర్గ స్థాయి సభ్యత్వ నమోదు సమీక్షా సమావే శంలో ఆయన మాట్లాడారు. సభ్యత్వ నమో దులో కనిగిరి నియోజకవర్గం అన్ని ప్రాంతాల్లో కంటే ముందుకు దూసుకు పోతోందన్నారు.  పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఐ-టీడీనీ  నా యకుల కృషిని ఆయన అభినందించారు.   ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ఉగ్ర ఏ కార్యక్రమం చేపట్టినా దానిని విజయవంతం చేయడంలో శక్తి వం చన లేకుండా కృషి చేస్తారన్నారు. అదేవిధంగా సభ్యత్వ నమోదు పొందిన కార్యకర్తలకు కలిగే ప్రయోజనాలను వివరించాలన్నారు.  ఆపదలో ఆసరాగా ఉండేలా రూ.2లక్షల బీమా లభి స్తుందన్నారు. వైద్యసేవలు అందుతాయన్నారు. పార్టీ కోసం కష్టపడి ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందన్నారు.  ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ విజయానికి కార్యకర్తలు సైనికుల్లా సిద్ధంగా ఉండాలని కోరారు.  కనిగిరిలో జెం డాను ఎగురవేయాలన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసే బాధ్యత మీ భుజస్కందాలపై ఉందన్నారు. ఇప్పటికైనా వైసీపీ పాలకులు, జగన్‌రెడ్డిపైన ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. టీడీపీ నిర్వహి స్తున్న బాదుడే బాదుడుతో ప్రజల్లో మరింత వ్యతిరేకత మొదలైందన్నారు. 

నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర నర సింహారెడ్డి మాట్లాడుతూ సభ్యత్వ నమోదులో కనిగిరికి గుర్తింపు తెచ్చేలా పనిచేస్తున్న ఐ-టీ డీపీ కార్యకర్తలను అభినందించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఐటీడీపీ కార్యకర్తలను వలంటీర్లుగా నియమించాలన్న ఆలోచనలో అధినేత చంద్రబాబు ఉన్నట్లు ఉగ్ర తెలిపారు.  సభ్యత్వ నమోదు చేయించుకునేందుకు ముందుకు వచ్చే నిరుపేదలకు నాయకులే సొంత డబ్బులు చెల్లించి సభ్యత్వాలను ఇవ్వాలని కోరారు. పార్టీ సభ్యులుగా చేరిన ప్రతి ఒక్కరికీ భరోసా ఇచ్చేలా చంద్రబాబు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప్రమాద సమయంలో వైద్య సేవలు  అందిం చేందుకు ప్రముఖ ఆసుపత్రులను చంద్ర బాబు ఎంపిక చేస్తున్నట్లు ఉగ్ర తెలిపారు. స మావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు బొమ్మన బోయిన వెంగయ్య, సానికొమ్ము తిరుపతిరెడ్డి, ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, నగరపంచాయతీ  అ ధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, దొడ్డా వెం కటసుబ్బారెడ్డి, చిరంజీవి, రాచమల్ల శ్రీనివాసు లురెడ్డి, తమ్మినేని వెంకటరెడ్డి, ముచ్చుమూరి చెంచిరెడ్డి,  శ్రీనివాసులరెడ్డి, నారపరెడ్డి (యడ వల్లి) శ్రీనివాసులరెడ్డి, గడ్డం బాలసు బ్బయ్య, ఇంద్రబూపాల్‌రెడ్డి, గుడిపాటి ఖాదర్‌, షేక్‌ ఫిరోజ్‌, రోషన్‌ సంధాని, జంషీర్‌ అహ్మద్‌, ఫరూక్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-26T05:18:28+05:30 IST