మగరాయిడిలా హెయిర్‌స్టైల్‌ మార్చిన హీరోయిన్

Jun 4 2021 @ 20:03PM

‘ఫైవ్‌ స్టార్‌’, ‘వరలారు’, ‘ఆటోగ్రాఫ్’తో పాటు అనేక చిత్రాల్లో నటించిన హీరోయిన్‌ కనిక. వివాహానంతరం కూడా ఈ మలయాళ భామకు సినిమా అవకాశాలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇటు కోలీవుడ్‌, అటు మాలీవుడ్‌లలో పలు చిత్రాల్లో నటిస్తోంది. ఈ క్రమంలో విక్రమ్‌ నటిస్తున్న ‘కోబ్రా’, విజయ్‌ సేతుపతి నటించే ‘యాదుమ్‌ ఊరే యావరుమ్‌ కేళీర్‌’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలను పోషిస్తోంది. అదేసమయంలో సోషల్‌ మీడియలో నిత్యం యాక్టివ్‌గా వుండే కనిక పలు సందర్భాల్లో ప్రత్యేక ఫొటోషూట్‌లలో పాల్గొని, ఆ ఫొటోలను తన సామాజిక ప్రసార మాధ్యమాల్లో పోస్టు చేస్తూ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. ఇపుడు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన ఓ ఫొటో చర్చనీయాంశంగా మారింది. పొడవాటి వెంట్రుకలను కలిగిన కనిక ఇపుడు పూర్తిగా మగరాయుడులా హెయిర్‌ స్టైల్‌ను మార్చుకుంది. దానికి కింద... ఓ చిత్రం షూటింగు కోసం ఇలా హెయిర్‌ కట్టింగ్‌ చేయించుకున్నాను అంటూ కనిక ట్వీట్‌ చేసింది. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.