కన్నియాకుమారిలో విస్తారంగా వర్షాలు

Published: Sun, 24 Apr 2022 11:27:24 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కన్నియాకుమారిలో విస్తారంగా వర్షాలు

అడయార్‌(చెన్నై): కన్నియాకుమారి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాలోని నాగర్‌కోయిల్‌లో ఐదు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి 1.30 సమయంలో ప్రారంభమైన వర్షం శనివారం ఉదయం 5 గంటల వరకు ఏకధాటిగా కురిసింది. దీంతో అనేక ప్రాంతాలతో పాటు రహదారులు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఈ వర్షాల కారణంగా ఈ జిల్లాలోని నీటి నిల్వ కేంద్రాల్లో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. పేచ్చిపారై రిజర్వాయర్‌ నీటి మట్టం 39.80 అడుగులకు చేరుకుంది. అలాగే, మిగిలిన రిజర్వాయర్ల నీటిమట్టం కూడా పెరిగింది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.