
పెరంబూర్(చెన్నై): కన్నియాకుమారి సముద్రతీరం ఆరు రోజుల తర్వాత సహజ స్థితికి చేరుకోవడంతో శనివారం వివేకానంద రాక్‌కు పడవ సవారీ యథావిధిగా సాగింది. ‘అసాని’ తుఫాను అనంతరం వాతావరణంలో మార్పులు ఏర్పడి రాష్ట్రంలోని తీరగ్రామాల్లో అలల ఉధృతి అధికంగా కొనసాగింది. రామేశ్వరం, మండపం, ధనుష్కోటి సహా పలు తీరాల్లో అలల ఉధృతి సాధారణం కన్నా 20 అడుగుల ఎత్తున కొనసాగింది. అలల ఉధృతి కారణంగా వాతావరణ శాఖ హెచ్చరికలతో జాలర్లు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో, ఆరు రోజుల అనంతరం సముద్రం సహజ స్థితికి చేరుకోవడంతో కన్నియాకుమారి వివేకానంద రాక్ వద్ద పడవ సవారీ ప్రారంభమైంది. సెలవులు కావడంతో వేలాదిగా తరలివచ్చిన పర్యాటకులతో కన్నియాకుమారి ప్రాంతం సందడిగా మారింది.
ఇవి కూడా చదవండి