
కాన్పూర్(ఉత్తరప్రదేశ్) : ప్రవక్త మొహమ్మద్‌పై అవమానకరమైన ట్వీట్లు చేసినందుకు కాన్పూర్ పోలీసులు ఓ బీజేపీ నాయకుడిని అరెస్టు చేశారు.కేంద్ర బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలపై ఘర్షణలు చెలరేగాయి. అప్పటి నుంచి ఆ ట్వీట్లు డిలీట్ చేశారు. పోలీసులు బీజేపీ యూత్ వింగ్ సభ్యుడు, విద్యార్థి కౌన్సిల్ సభ్యుడు హర్షిత్ శ్రీవాస్తవను అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు.‘‘ హర్షిత్ శ్రీవాస్తవ పోస్ట్‌లు అభ్యంతరకరంగా ఉన్నాయి. దీనిపై మేం తక్షణమే చర్యలు తీసుకున్నాం, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం, ఆ తర్వాత నిందితుడిని అరెస్టు చేశాం’’ అని పోలీసు అధికారి విజయ్ సింగ్ మీనా తెలిపారు.
ఎవరైనా మతపరమైన ఉన్మాదాన్ని రెచ్చగొట్టడానికి లేదా సామాజిక సామరస్యానికి భంగం కలిగించడానికి ప్రయత్నిస్తే నిష్పక్షపాతంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న నేపథ్యంలో నూపుర్ శర్మతోపాటు నవీన్ కుమార్ జిందాల్‌ను కేంద్రపార్టీ బహిష్కరించింది.
ఇవి కూడా చదవండి