రాత్రి వేళ రోడ్డుపై వదిన, మరిది.. ఇంతలో అయిదుగురు దొంగలు వచ్చి దారుణం..

ABN , First Publish Date - 2021-10-03T07:31:17+05:30 IST

ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్‌ నగర సమీమంలో ఓ గ్రామం వద్ద తన వదినను ఆమె పుట్టింటికి తీసుకువెళుతున్న మరిదిపై మార్గ మధ్యంలో కొందరు దుండగులు దాడి చేశారు. వారి వద్ద ఉన్న డబ్బు, నగలు లాక్కున్నారు. ఆ తరువాత తాము చెప్పినట్టు వినకుంటే ప్రాణాలు తీస్తామని వారిద్దరినీ బెదిరించారు. ఆ తరువాత ఏం జరిగిందంటే..

రాత్రి వేళ రోడ్డుపై వదిన, మరిది.. ఇంతలో అయిదుగురు దొంగలు వచ్చి దారుణం..

ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్‌ నగర సమీమంలో ఓ గ్రామం వద్ద తన వదినను ఆమె పుట్టింటికి తీసుకువెళుతున్న మరిదిపై మార్గ మధ్యంలో కొందరు దుండగులు దాడి చేశారు. వారి వద్ద ఉన్న డబ్బు, నగలు లాక్కున్నారు. ఆ తరువాత తాము చెప్పినట్టు వినకుంటే ప్రాణాలు తీస్తామని వారిద్దరినీ బెదిరించారు. ఆ తరువాత ఏం జరిగిందంటే..

కాన్పూర్‌కు చెందిన రవి(పేరు మార్చబడినది) కొత్తగా పెళ్లి అయిన తన వదిన(అనిత -పేరు మార్చబడినది)ను రసూలాబాద్ గ్రామంలోని ఆమె పుట్టింటికి చేర్చడానికి బైక్‌పై బయలుదేరాడు. రాత్రి 8 గంటల సమయంలో రసూలాబాద్ మరికొంత దూరం ఉందనగా ముఖానికి మాస్క్ వేసుకున్న అయిదుగురు దొంగలు వారిని అడ్డుకున్నారు. వారిపై కర్రలతో దాడి చేశారు. వారి వద్ద ఉన్న డబ్బులు, నగలు ఇవ్వమని.. లేకపోతే చంపేస్తామని బెదిరించారు. వారు భయపడి ఇచ్చేసారు.

రవి, అతని వదిన నుంచి అన్నీ తీసుకున్న తరువాత కూడా వారిని వదల్లేదు. అనిత(రవి వదిన)ను పట్టుకొని.. తాము చెప్పినట్లు చెయ్యకపోతే రవిని కత్తులతో పొడిచి చంపేస్తామని బెదిరించారు. ఆ అయిదుగురు దుండగులలో ముగ్గురు అనితను దగ్గర్లోని పాత భవనంలోకి లాక్కిళ్లి ఆమెపై అత్యాచారం చేశారు. తరువాత ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని చెప్పి ఆ అయిదుగురు దొంగలు తమ వద్ద ఉన్న రెండు బైకులపై అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఈ ఘటనతో రవి, అతని వదిన అనిత భయపడిపోయి ఎవరికీ ఈ విషయం గురించి చెప్పలేదు. వారం రోజులు గడిచిన తరువాత అనిత ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకొని జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లింది. జరిగిన విషయాన్ని అక్కడ వివరించి ఫిర్యాదు చేసింది. ఆ అయిదుగురు దొంగలలో ఇద్దరు మాస్క్ తీసినప్పుడు తాను చూసానని అనిత చెప్పింది. ఇంకా వారి వద్ద ఉన్న రెండు బైక్‌లలో ఒక దాని నెంబర్ తనకు గుర్తు ఉందని పోలీసులకు వివరించింది. పోలీసులు ఆ బైక్ నెంబర్ ఆధారంగా ఆ అయిదుగురిలో ఇద్దరిని అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-03T07:31:17+05:30 IST