Obscene videos: అమ్మాయిల అశ్లీల వీడియోలు తీస్తున్న హాస్టల్ స్వీపర్ అరెస్టు

ABN , First Publish Date - 2022-09-30T20:04:51+05:30 IST

బాలికల హాస్టల్‌లో ఉంటున్న అమ్మాయిల అశ్లీల వీడియోలు తీస్తున్న హాస్టల్ స్వీపర్‌ను కాన్పూర్..

Obscene videos: అమ్మాయిల అశ్లీల వీడియోలు తీస్తున్న హాస్టల్ స్వీపర్ అరెస్టు

కాన్పూర్: బాలికల హాస్టల్‌లో (Girls hostel) ఉంటున్న అమ్మాయిల అశ్లీల వీడియోలు (Obsecene videos) తీస్తున్న హాస్టల్ స్వీపర్‌ (sweeper)ను కాన్పూర్ (kanpur) పోలీసులు శుక్రవారంనాడు అరెస్టు (Arrest) చేశారు. కాన్పూరులోని సాయి నివాస్ గాళ్స్ హాస్టల్‌లో ఉంటున్న నీట్ అభ్యర్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ అరెస్టు చేశారు. మరికొంద మంది అమ్మాయిలు కూడా ఇదే తరహా ఫిర్యాదులు చేశారు. దీనిపై కల్యాణ్‌పూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆప్ ఫోలీస్ డీకే శుక్రా మాట్లాడుతూ, నిందితుడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్టు చెప్పారు.


''తమ వీడియోలు తీస్తున్నాడంటూ సాయి నివాస్ గాళ్స్ హాస్టల్‌లో ఉంటున్న నీట్ విద్యార్థిని ఫిర్యాదు ఇచ్చింది. మరో 12 మంది అమ్మాయిలు కూడా ఆమెతో వచ్చి ఫిర్యాదు చేశారు. గత ఎనిమిదేళ్లుగా నిందితుడు ఇదే హాస్టల్‌లో పనిచేస్తున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం'' అని శుక్లా తెలిపారు. మహిళా విద్యార్థినుల వీడియోలు రికార్డు చేసి లీక్ చేస్తున్నారనే ఆరోపణలపై ఇటీవల చండీగఢ్ యూనివర్శిటీ క్యాంపస్‌లో కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి.

Updated Date - 2022-09-30T20:04:51+05:30 IST