కంటి వెలుగు.. కష్టమేనా..?

ABN , First Publish Date - 2021-11-24T06:05:38+05:30 IST

జగనన్న కంటి వెలుగు పథకంతో.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో దృష్టి లోపం గుర్తించి అందుకు అవసరమైన చర్యలు తీసుకోవా లి.

కంటి వెలుగు..  కష్టమేనా..?
విద్యార్థులకు కంటి పరీక్షలు చేస్తున్న వైద్యులు

 ఇంకా ఖరారు కాని విధివిధానాలు

 ఈ ఏడాదిజగనన్న పథకం అటకెక్కినట్లేనా

బడుల మూతతో గత ఏడాదీ అరకొరగానే

 జిల్లాలో 4956 పాఠశాలల విద్యార్థుల ఎదురుచూపు

గుంటూరు(విద్య), నవంబరు 23: జగనన్న కంటి వెలుగు పథకంతో.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో దృష్టి లోపం గుర్తించి అందుకు అవసరమైన చర్యలు తీసుకోవా లి. అయితే ఈ ఏడాది ఈ పథకానికి సంబంధించి ఇంతవరకు విధివిధానాలు ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది కంటి వెలుగు పథకం అటకెక్కినట్లేనని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. మరికొ ద్ది రోజుల్లో డిసెంబరు నెలలోకి ప్రవేశిస్తున్నా కూడా అటు విద్యాశాఖ నుంచి కానీ, ఇటు జిల్లా వైద్యఆరోగ్యశాఖ నుం చి కాని ఈ పథకంపై స్పష్టత లేదు. కొవిడ్‌ నేపథ్యంలో గత ఏడాది కూడా సక్రమంగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేదని ప్రధానోపాధ్యాయులు చెప్పారు. దీంతో లక్షల మంది విద్యార్థులు పరీక్షల కోసం ఎదరు చూడాల్సి న దుస్థితి నెలకొంది. కంటివెలుగు పరీక్షలకు సంబంధించి ఇప్పటికే 4956 పాఠశాలల్ని ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు దాదాపు 6.50 లక్షల మంది ఉన్నారు.  

విద్యార్థుల్లో పెరుగుతున్న కంటి సమస్యలు

కరోనా నేపథ్యంలో పాఠశాలలకు దూరమైన విద్యార్థులు ఆనలైనలోనే క్లాసులు వింటూ వచ్చారు. ప్రతి రోజు సగటున 6 నుంచి 8 గంటలు ట్యాబ్‌ లేదా స్మార్ట్‌ఫోన, కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ చూస్తూ పాఠాలు విన్నారు. దీంతో గతంలో కంటే ఇప్పుడు కంటి సమస్యలు అధికమైనట్లు వెద్యులు వెల్లడిస్తున్నారు. జీజీహెచలో గతంలో రోజుకు 10లోపు ఉండే చిన్నారుల కంటి ఓపీలు ఇప్పుడు రోజుకు సగటున 20 నుంచి 25 వరకు ఉంటున్నాయి. ఇక ప్రైవేటుగా కంటి పరీక్షలు చేయించుకునే విద్యార్థుల సంఖ్య కొవిడ్‌ తరువాత భారీగా పెరిగినట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. ఎక్కువ సేపు ఆనలైనలో పాఠాలు వినడం, స్మార్ట్‌ఫొనలో గేమ్స్‌ అడడం వల్లే ఇటువంటి సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పాఠశాలల్లో కంటివెలు గు పథకం కింద పరీక్షలు చేపడితే విద్యార్థుల్లోని సమస్యలను గుర్తించవచ్చని ఉపాధ్యాయులు చెప్తున్నా రు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో పాఠశాలలు నడుస్తున్నా యి. అయినా కంటి వెలుగు పథకం అమలుపై అధికారులు దృష్టి సారించడంలేదు. ప్రతి పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు కంటి పరీక్షల్ని పర్యవేక్షించేలా గతంలో ఏర్పాట్లు చేశారు. ఆశా కార్యకర్త సంబంధిత ఉపాధ్యాయుడి సమక్షంలోనే విద్యార్థులకు కంటి పరీక్షలు చేస్తారు. దీనికి సంబంఽధించి ఒక విజన చార్టును, ఒక టార్చిలైట్‌ను, ఒక టేపును పాఠశాల స్థాయిలో అందజేస్తారు. అయితే ఈ ఏడాది ఇంత వరకు ఆయా పరికరాలు పాఠశాలలకు అందలేదు.

వైద్య ఆరోగ్యశాఖ నుంచే షెడ్యూల్‌ రావాలి

కంటి పరీక్షలకు సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుంచి షెడ్యూల్‌ రావాలి. ఆ షెడ్యూల్‌ ప్రకారం జిల్లాలోని పాఠశాలల్లో ఏర్పాట్లు చేస్తాం. అయితే ఇప్పటి వరకు తమకు ఎటువంటి షెడ్యూల్‌ రాలేదు.  - గంగాభవాని, డీఈవో


Updated Date - 2021-11-24T06:05:38+05:30 IST