అర్థరాత్రి షారుక్ ఖాన్ ఇంటికి వెళ్లిన కపిల్ శర్మ.. ఆయన రియాక్షన్ చూసి షాక్..

Published: Sat, 29 Jan 2022 09:33:48 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అర్థరాత్రి షారుక్ ఖాన్ ఇంటికి వెళ్లిన కపిల్ శర్మ.. ఆయన రియాక్షన్ చూసి షాక్..

సోనీ టీవీలో ప్రసారమయ్యే ‘ది కపిల్ శర్మ షో’తో మంచి పాపులారిటీ సాధించిన కమెడియన్, యాంకర్ కపిల్ శర్మ. ఈ షోలో తన కామెడీ టైమింగ్‌తో దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అంతేకాకుండా ఈ నటుడు ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ‘కపిల్ శర్మ: ఐయామ్ నాట్ డన్ యెట్’ అనే స్టాండప్ షో సైతం చేస్తున్నాడు. అందులో తన జీవితంలో జరిగిన కొన్ని ఫన్నీ, ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.ఆ షోలో కపిల్ మాట్లాడుతూ.. ‘‘ది కపిల్ శర్మ షో’తో నాకు మంచి పాపులారిటీ వచ్చింది. ఇది నాలో కొన్ని తప్పుడు ఆలోచనలకు సైతం కారణమైంది. అందుకే అర్థరాత్రి షారుక్ ఖాన్ ఇంటిని చూడాలని ఉందన్న నా కజిన్ కోరికను తీర్చాలనుకున్నాను.


ఆ సమయంలో నేను బాగా తాగి ఉన్నాను. అందుకే అక్కడికి వెళ్లాను. ఆ సమయంలో అక్కడ పార్టీ జరుగుతోంది. గేట్లు తెరిచే ఉండడంతో నా ఫేమ్‌ని దుర్వినియోగం చేయాలనుకున్నా. కారుని లోపలికి తీసుకెళ్లమని నా డ్రైవర్‌కి చెప్పా. కారులో నేనుండడం చూసిన సెక్యూరిటీ గార్డ్స్ పార్టీకి ఆహ్వానించి ఉంటారని భావించారు. అందుకే రాత్రి 3 గంటల సమయంలోనూ మమల్మి లోపలికి వదిలారు.


కానీ లోపలికి వెళ్లిన తర్వాత మేం చేసిన పని కరెక్ట్ కాదని గ్రహించి వెనక్కి వెళ్లిపోవాలనుకున్నా. అప్పుడు షారుక్ మెనేజర్లు వచ్చి మమ్మల్ని లోపలికి ఆహ్వానించారు. నేను షార్ట్స్ వేసుకుని ఉన్నా. తలుపులు తీయగానే గౌరీ బాబి, ఆమె స్నేహితులు కొందరూ అక్కడ కూర్చుని ఉన్నారు. షారుఖ్ నాకు ఫోన్ చేసి ఉంటాడని అనుకుంది.


నేను ఆమెకి హలో చెప్పగా.. షారుక్ లోపల ఉన్నాడని చెప్పడంతో లోపలికి వెళ్లాను. ఆయన ఎప్పటిలాగే సరదాగా డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. నేను అయోమయంలో పడ్డాను. ఆయన వద్దకు వెళ్లి ‘భాయ్ క్షమించండి, నా కజిన్ మీ ఇంటిని చూడాలని ఉందంటే తీసుకువచ్చాను అని తెలిపాను’. దానికి షారుక్ వెంటనే నువ్వు రావాలనుకుంటే నా బెడ్ రూమ్ తలుపులు కూడా తెరిచే ఉంటాయన్నాడు. ఆయన మాటలకి నేను షాకయ్యా. అనంతరం కొద్దిసేపు షారుక్‌తో కలిసి డ్యాన్స్ చేశాను. ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు ఆయన స్టాప్ నాతో ఫోటోలు తీసుకున్నారు. వాటిని ఆయనే స్వయంగా తీశాడు" అని చెప్పుకొచ్చాడు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...