
బాలీవుడ్ స్టార్ కమెడియన్స్‌లో కపిల్ శర్మ (Kapil Sharma)ఒకరు. ప్రస్తుతం కెనడాలో కన్సర్ట్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆ దేశంలో విపరీతంగా సందడి చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇంగ్లీష్ మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఆ పోస్ట్‌ను చూసిన నెటిజన్స్ కపిల్‌పై ఛలోక్తులు విసురుతున్నారు.
కెనడా డే సందర్భంగా బయటికి వెళ్లొద్దాం అని డ్రైవర్‌తో కపిల్ శర్మ అంటున్నారు. ‘‘ఓపెన్ టాప్ జీప్‌లో పరిసర ప్రాంతాలను చూసొద్దాం. నేను అంతా తిప్పి చూపిస్తాను. ప్రస్తుతం వర్షం పడుతుంది. జీప్ స్మాష్ అయింది’’ అని కపిల్ శర్మ చెప్పారు. డ్రైవర్‌తోనే.. జీప్‌లు ఓపెన్‌గా ఉంటాయి, నీకు ఇంగ్లీష్ తెలియదా బ్రదర్ అని కపిల్ తెలిపారు. టూ మచ్ ఇంగ్లీష్ ఇన్ టోరెంటో అని ఆయన క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్ కింద సెలబ్రిటీలతో పాటు నెటిజన్స్ కూడా కామెంట్ చేశారు. భారతి సింగ్ (Bharti Singh), టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) రిప్లై ఇచ్చారు. ‘‘మీరు ఇంగ్లీష్‌ను ఎంపిక చేసుకోలేదు.. ఇంగ్లీషే మిమ్మల్ని ఎంపిక చేసుకుంది’’ అని ఓ నెటిజన్ తెలిపారు. ‘‘కెనడియన్ వాతావరణం నవ్వు తెప్పించేలా ఉంది’’ అని మరో నెటిజన్ చెప్పారు. ‘‘ఇంగ్లీష్‌లో మాట్లాడి ఏ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు’’ అని ఓ సోషల్ మీడియా యూజర్ చెప్పారు. తన కామెడీ షోలతో కపిల్ శర్మ దేశ వ్యాప్తంగా అందరికి చేరువయ్యారు. 2007లో ‘ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’(The Great Indian Laughter Challenge)షో విజేతగా నిలిచారు. అనంతరం ‘కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మ’(Comedy Nights With Kapil Sharma) టాక్ షోను హోస్ట్ చేశారు. గతంలో కొన్ని సినిమాలు కూడా చేశారు. ప్రస్తుతం నందితా దాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు.