కాపు కార్పొరేషన్‌కు వెంటనే నిధులు కేటాయించాలి

Sep 28 2021 @ 00:10AM
రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న కాపు నాయకులు

కాపు కార్పొరేషన్‌కు వెంటనే నిధులు కేటాయించాలి

ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహన్‌

కృష్ణలంక, సెప్టెంబరు 27 : కాపు కార్పొరేషన్‌కు వెంటనే నిధులు కేటాయించాలని, కాపు కార్పొరేషన్‌ ద్వారా గత ప్రభుత్వంలో పెండింగ్‌లో వున్న వాటిని కొనసాగించాలని ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహన్‌ డిమాండ్‌ చేశారు. కాపు సంఘాల రౌండ్‌టేబుల్‌ సమావేశం సోమవారం కృష్ణలంక నెహ్రూనగర్‌లోని కల్యాణమండపంలో జరిగింది. ఈ కార్యక్రమం ఐక్య కాపునాడు అధ్యక్షుడు బేతు రామ్మోహన్‌ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ కాపు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి పలు డిమాండ్‌లు చేశారు. సమావేశంలో అందరూ ప్రస్తుత పరిస్థితుల్లో కాపు జాతి సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చేలా ప్రయత్నం చేయాలని డిమాండ్‌ చేశారు. బలిజ, తెలగ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో కాపు సంఘాల ఐక్యతతో ధర్నా చేపట్టాలని పలువురు తీర్మానం చేశారు. 

కూడేటి జలాచంద్రరావు, కాపు జేఏసీ డాక్టర్‌ రావూరి, డీఆర్‌ఎం నాయుడు, కబాడీ శ్రీను, అమరావతి కాపునాడు అధ్యక్షుడు వన్నంరెడ్డి రాధాకృష్ణ, గిద్ద శ్రీనివాస్‌, మేడిశెట్టి గంగ మహేశ్వరరావు, కనపర్తి సతీష్‌, ముత్యాల రమేష్‌, పిన్నింటి అమృతకళ, గాళ్ల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.