అల్లవరం మార్చి 26: అన్ని రంగాల్లో వెనుకబడ్డ కాపులు రాజ్యాధికారం పొందడానికి ఐక్యతతో ముందుకు సాగాలని, కాపుల రిజర్వేషన్ల అమలుకు అందరూ సహకరించాలని కాపు సంక్షేమ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంధం సత్యశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లినీడి తిరుపతిరావు కోరారు. కేఎస్ఎస్ రాష్ట్ర రైతు అధ్యక్షుడు బసవా చినబాబు అధ్యక్షతన గోడితిప్పలో శనివారం జిల్లా అధ్యక్షుడు మేడిద శంకరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కేఎస్ఎస్ రాష్ట్ర రైతు సమావేశంలో వారు మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాపుల సత్తా చూపిస్తా మని, కాపులకే రాజ్యాధికారం అన్న నినాదంతో పవన్‌కల్యాణ్ సీఎం కావడం తథ్యమన్నారు. కాపు రైతు విభాగం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తుమ్మల పద్మజ మాట్లాడుతూ కాపు లపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతుందన్నారు. రాష్ట్ర రైతు అధ్యక్షుడు బసవా చినబాబు మాట్లాడుతూ ధాన్యం అమ్మిన రైతులకు డబ్బులు చెల్లించని దుస్థితి రాష్ట్రం లో నెలకొందన్నారు. కడియం సందీప్, రాజరపు రమేష్, చిట్నీడి శ్రీదేవి తదితరులు మాట్లాడారు. సమావేశంలో రైతు ప్రధాన కార్యదర్శి నూకల సూర్యప్రకాష్, తోలేటి సాగర్ కుమార్, గుర్రాల శ్రీనివాస్, పాటి శివ, గొలకోటి వెంకటరెడ్డి, రంకిరెడ్డి సూర్యనారాయణ, కోటేశ్వరరావు, చెదళ్ల సుధాకర్, వివిధ జిల్లాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.