అమరావతికి పాదయాత్రగా వెళ్తున్న కారంపూడి అరెస్టు

ABN , First Publish Date - 2022-05-28T06:18:54+05:30 IST

అమరావతికి పాదయాత్రగా వెళ్తున్న కారంపూడి అరెస్టు

అమరావతికి పాదయాత్రగా వెళ్తున్న కారంపూడి అరెస్టు
నోటీసు ఇస్తున్న పోలీసు

ఏలూరు రూరల్‌, మే 27: నిరుద్యోగులకు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని అమరావతికి పాద యాత్రగా వెళ్తున్న కారంపూడి ఫౌండేషన్‌ ట్రస్టు చైర్మన్‌ కారంపూడి విజయ్‌ను హనుమాన్‌జంక్షన్‌ దాటాక ఆత్కూరు వద్ద పోలీసులు అరెస్టు చేసి, నోటీసు అందజేశారు. ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ గురువారం విజయ్‌ ఏలూరు నుంచి పాదయాత్ర చేపట్టారు. ఒంటరిగా కాలినడకన వెళ్తున్న తన ను శాంతిభద్రతల పేరుతో పోలీసులు అరెస్టు చేయడం సరికాదని విజయ్‌ అన్నారు.

Updated Date - 2022-05-28T06:18:54+05:30 IST