Alia Bhatt ప్రెగ్నెన్సీ గురించి తెలిసి.. కన్నీటి పర్యంతమైయ్యానంటున్న Karan Johar

Published: Wed, 06 Jul 2022 13:47:39 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Alia Bhatt ప్రెగ్నెన్సీ గురించి తెలిసి.. కన్నీటి పర్యంతమైయ్యానంటున్న Karan Johar

దాదాపు ఐదేళ్ల డేటింగ్ తర్వాత అలియా భట్ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ఈ ఏడాది ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే జంట తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. ఆ విషయాన్ని అలియా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. దీంతో ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ జంటకి విషెస్ తెలిపారు. అలియా భట్‌కి సంబంధించిన ప్రతి విషయాన్ని సెలబ్రేట్ చేసే బాలీవుడ్ సెలబ్రిటీల్లో కరణ్ జోహార్ (Karan Johar) మొదటివాడు. ఆయన సైతం తాజాగా అలియా ప్రెగ్నెన్సీపై ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.


కరణ్ మాట్లాడుతూ.. ‘నేను నా ఆఫీసులో కూర్చొని ఉన్నా. ఆ సమయంలో అలియా అక్కడికి వచ్చింది. తను తల్లి కాబోతున్న శుభవార్తని నాకు తెలిపింది. నేను నమ్మలేకపోయాను. వెంటనే ఏడవడం మొదలుపెట్టాను. ఎందుకంటే అలియా నా కూతురులాంటిది. అలాంటి చిన్న పాప మరో బెబీకి జన్మనిచ్చేందుకు సిద్ధమవ్వడం నాకు ఎంతో ఎమోషనల్‌గా అనిపించింది. నేను అమ్మాయిలా ఉన్న తను గొప్ప నటిగా, ఇప్పుడు ఓ తల్లిగా మారడం చూస్తున్న అందుకే ఏడుపు ఆపుకోలేకపోయా. అదే విషయాన్ని అలియాకి చెప్పా. తను వచ్చి నన్ను కౌగిలించుకుని సముదాయించింది’ అని ఎంతో ఎమోషనల్‌గా చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా.. 17 ఏళ్ల అమ్మాయిగా తను నా ఆఫీసులోకి అడుగుపెట్టినప్పటి నుంచే అలియాని నా కూతురుగా భావిస్తూ వచ్చానని తెలిపాడు. నిజానికి తనే ఆయన మొదటి బిడ్డ అని కరణ్ చెప్పాడు.

Alia Bhatt ప్రెగ్నెన్సీ గురించి తెలిసి.. కన్నీటి పర్యంతమైయ్యానంటున్న Karan Johar

అలియా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమాకి దర్శకుడు కరణ్ జోహారే. అప్పటి నుంచి వారిమధ్య మంచి బంధం ఉంది. అలియాకి సంబంధించిన ప్రతి విషయాన్ని కరణ్ సెలబ్రేట్ చేస్తూ వస్తున్నాడు. నటి కెరీర్‌కి సైతం కరణ్ ఎంతో తోడ్పాటుని అందించాడు. కాగా.. అలియా ప్రస్తుతం ఓ హాలీవుడ్ మూవీలో ‘వండర్ వుమెన్’ ఫేమ్ గాల్ గాడెట్‌తో కలిసి నటిస్తోంది. అలాగే.. భర్త రణ్‌బీర్ కపూర్‌తో కలిసి చేసిన మూవీ ‘బ్రహ్మాస్త్ర’ సెప్టెంబర్ 9న విడుదల కానుంది. అలాగే.. కరణ్ జోహార్ సైతం ఓ బాలీవుడ్ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నాడు. అలాగే.. పలు సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉన్నాడు. ‘కాఫీ విత్ కరణ్’ షో సీజన్ 7కి హోస్ట్‌గా సైతం వ్యవహరిస్తున్నాడు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...