Karanam Dharmasri: టీడీపీ నేతలు ప్రదర్శించిన తీరు బాధాకరం...

ABN , First Publish Date - 2022-09-19T21:47:39+05:30 IST

ప్రజా సమస్యలపై శాసనసభలో మాట్లాడాలని ఎమ్మెల్యేలంతా ఎదురుచూస్తున్నారని కరణం ధర్మశ్రీ అన్నారు.

Karanam Dharmasri: టీడీపీ నేతలు ప్రదర్శించిన తీరు బాధాకరం...

అమరావతి (Amaravathi): ప్రజా సమస్యలపై శాసనసభలో మాట్లాడాలని ఎమ్మెల్యేలంతా ఎదురుచూస్తున్నారని ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ (Karanam Dharmasri) అన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ  రైతాంగ ఇబ్బందులపై సభలో తమ గొంతు వినిపించాలని సభ్యులు చూస్తున్నారని, రైతులకు లబ్ధి చేకూరే బిల్లును ప్రవేశపెడుతుంటే టీడీపీ సభ్యులు (TDP Leaders) అడ్డుపడుతున్నారని, రోజుకో విన్యాసం చేస్తూ సభా సమయాన్ని వృధా చేస్తున్నారని విమర్శించారు. సభ సజావుగా జరగకూదనేదే టీడీపీ లక్ష్యమన్నారు. పోలవరంపై చర్చను టీడీపీ సరిగా సాగనివ్వడం లేదని, సీఎం జగన్ (CM Jagan) పోలవరంపై వివరించడంతో టీడీపీ నేతలకు దిమ్మతిరిగిందన్నారు. సర్ ఆర్ధర్ కాటన్ మాదిరిగా పోలవరం ప్రగతిపై సీఎం వివరించారన్నారు. రెవిన్యూ, విద్యాశాఖలపై బిల్లులు ప్రవేశపెడుతున్న సమయంలో టీడీపీ నేతలు ప్రదర్శించిన తీరు బాధాకరమన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ సభ్యులకు మూడు సార్లు అవకాశం ఇచ్చారని, అయినా వాళ్లు వినలేదన్నారు. వారి పాపాలు ప్రజలకు శాపం కాకూడదని టీడీపీ నేతలను కోరుతున్నానన్నారు. సభా సమయం వృధా కానివ్వొద్దని టీడీపీ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నానని కరణం ధర్మశ్రీ అన్నారు.

Updated Date - 2022-09-19T21:47:39+05:30 IST