ఆంధ్రజ్యోతి కథనంపై కదిలిన యంత్రాంగం

ABN , First Publish Date - 2022-08-09T05:30:00+05:30 IST

కరప, ఆగస్టు 9: బాబోయ్‌ పురుగులు అనే శీర్షికతో సోమవారం ఆంధ్రజ్యోతిలో వెలువడిన కథనంపై అధికార యంత్రాంగం స్పందించింది. పెంకు పురుగులకు నిలయమైన కొరుపల్లిలోని గోదాములను తహశీల్దార్‌ పొన్నమండ శ్రీనివాసరావు, ఆర్‌ఐ పేపకాయల మాచరరావులు సందర్శించి గోదాముల్లో స్టోర్‌ చేసిన పీడీఎఫ్‌ బియ్యం నిల్వలను, బస్తాలకు పట్టిన పెంకుపురుగులను పరిశీలించారు. బియ్యం స్టాకుపై కవర్లు కప్పకపోవ

ఆంధ్రజ్యోతి కథనంపై కదిలిన యంత్రాంగం
కొరుపల్లిలో పరిశీలిస్తున్న అధికారులు

పెంకు పురుగుల ఉధృతిపై ఉన్నతాధికారులకు నివేదిక

కరప, ఆగస్టు 9: బాబోయ్‌ పురుగులు అనే శీర్షికతో సోమవారం ఆంధ్రజ్యోతిలో వెలువడిన కథనంపై అధికార యంత్రాంగం స్పందించింది. పెంకు పురుగులకు నిలయమైన కొరుపల్లిలోని గోదాములను తహశీల్దార్‌ పొన్నమండ శ్రీనివాసరావు, ఆర్‌ఐ పేపకాయల మాచరరావులు సందర్శించి గోదాముల్లో స్టోర్‌ చేసిన పీడీఎఫ్‌ బియ్యం నిల్వలను, బస్తాలకు పట్టిన పెంకుపురుగులను పరిశీలించారు. బియ్యం స్టాకుపై కవర్లు కప్పకపోవడం, పురుగుల నివారణకు ఎటువంటి కెమికల్‌ స్ర్పేయింగ్‌ చేయకపోవడం గుర్తించారు. పెంకు పురుగుల వల్ల ప్రజలు పడుతున్న అవస్థలు, గోదాముల నిర్వహణలో నిర్లక్ష్యం తదితర అంశాలను వివరిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ సివిల్‌ సప్లయిస్‌ జిల్లా మేనేజర్‌కు నివేదిక అందజేసినట్టు తహశీల్దార్‌ తెలిపారు. వీఆర్‌వో నాగరాజు పాల్గొన్నారు. మండల వైద్యాధికారి ఆర్‌.శ్రీనివాసనాయక్‌ కూడా గొడౌన్లు పరిశీలించారు.


Updated Date - 2022-08-09T05:30:00+05:30 IST