Advertisement

రెండో కొడుకు ఫొటో షేర్ చేసిన కరీనా!

Mar 8 2021 @ 12:40PM

బాలీవుడ్ ప్రముఖ కథానాయిక కరీనా కపూర్ ఇటీవల రెండోసారి తల్లి అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సైఫ్ అలీఖాన్, కరీనాల రెండో కొడుకు ఫొటో గురించి అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా కరీనా తన చిన్నారి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా కరీనా ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

 

 `మహిళలకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..` అని కామెంట్ చేసింది. ఈ ఫొటోలో కరీనా రెండో కొడుకు ఉన్నప్పటికీ అతడి మొహం మాత్రం కనబడలేదు. దీంతో కరీనా అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. చిన్నారి మొహం కనబడేలా మరో ఫొటో షేర్ చెయ్యాలని కామెంట్లు చేస్తున్నారు. 

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.