
చెన్నై : ఉడయార్ పాళయంలో తలపై కరగం ఉంచుకొని వరి నాట్లు వేసిన దివ్యాంగ విద్యార్థిని గ్రామస్తులు, రైతులు ప్రశంసించారు. అరియలూరు జిల్లా ఉడయార్‌పాళయం సమీపం పెరియతిరుకోనమ్ గ్రామానికి చెందిన పాండియన్-మాల దంపతులకు కృష్ణవేణి (15) అనే కుమార్తె ఉంది. కృష్ణవేణి జయంకొండాలో ఉన్న బధిరుల పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. వ్యవసాయాన్ని కాపాడుకోవాలని, ప్రాచీన కళారూపం కరగాట్టంను ఆదరించాలనే కోరికతో కృష్ణవేణి తలపై కరగం ఉంచుకొని పొలంలో దిగి వరినాట్లు వేసింది. గంటకు పైగా కరగాట్టం ఆడుతూ, వరి నాట్లు వేసిన కృష్ణవేణిని గ్రామస్తులు, రైతులు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ విషయమై విద్యార్థిని తల్లి మాల మాట్లాడుతూ, వ్యవసాయ పరిరక్షణ, కరగాట్టంకు ఆదరణ తదితర కోర్కెలతో కృష్ణవేణి ఈ అవగాహన కార్యక్రమం చేపట్టిందని, ఈ దృశ్యాలను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు పంపనున్నట్టు తెలిపింది.