సార్వా ప్రణాళిక 1,21,138 హెక్టార్లు

ABN , First Publish Date - 2022-05-29T06:50:45+05:30 IST

సార్వా పంటల ప్రణాళిక సిద్ధమైంది. ఏలూరు జిల్లా సార్వాలో మొత్తం పంటల సాగు లక్షా 21 వేల 138 హెక్టార్లు కాగా, ఇందులో ప్రధా న పంట వరి లక్షా ఏడు వేల 21 హెక్టార్లు సాగుకు జిల్లా వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్ణయించింది.

సార్వా ప్రణాళిక 1,21,138 హెక్టార్లు

వరి సాగు లక్ష్యం.. లక్షా ఏడు వేల హెక్టార్లు  

జూన్‌ 1 నుంచే ముందస్తుగా సాగు నీరు విడుదల

అక్టోబరు నాటికే కోతలు పూర్తయ్యేలా ప్రణాళిక

విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసిన అధికారులు 

ఏలూరు సిటీ, మే 28 : సార్వా పంటల ప్రణాళిక సిద్ధమైంది. ఏలూరు జిల్లా సార్వాలో మొత్తం పంటల సాగు లక్షా 21 వేల 138 హెక్టార్లు కాగా, ఇందులో ప్రధా న పంట వరి లక్షా ఏడు వేల 21 హెక్టార్లు సాగుకు జిల్లా వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్ణయించింది. గోదావరి కెనా ల్‌ బేసిన్‌లో 27 వేల 449 హెక్టార్లు, కృష్ణా కెనాల్‌ బేసిన్‌ లో 23 వేల 378 హెక్టార్లు, బోర్ల కింద 38 వేల 994 హెక్టార్లు, చెరువుల కింద 17 వేల 200 హెక్టార్లలో వరి సాగు చేపట్టాలని వ్యవసాయ శాఖ ప్రణాళికలో పేర్కొం ది. సార్వాలో పెసలు 200 హెక్టార్లు, మినుములు 2,032 హెక్టార్లు, ప్రత్తి 5,232 హెక్టార్లు, చెరకు 3,545 హెక్టార్లు, మొక్కజొన్న 1,990 హెక్టార్లు, వేరుశనగ 796 హెక్టార్లు, ఇతర పంటలు 322 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. 


విత్తనాలు.. ఎరువులు

సార్వాలో ప్రధానంగా ఎంటీయూ 7029 విత్తనాలు 30 శాతం, ఎంటీయూ 1064 విత్తనాలు 20 శాతం, ఎంటీయూ 1061 విత్తనాలు 15 శాతం, ఎంటీయూ 1315 విత్తనాలు 15 శాతం, ఎంటీయూ 1318 విత్తనాలు పది శాతం, బీపీటీ 5204 విత్తనాలు నాలుగు శాతం, సంపత్‌ రకం విత్తనాలు రెండు శాతం పంట పొలాల్లో సాగు చేయాలని నిర్ణయించారు. జిల్లాలో మొత్తం 53 వేల 510 క్వింటాళ్ల విత్తనా లు అవసరమని అంచనా. రైతుల నుంచి రైతులు తీసుకునే విత్తనాలు 50 వేల 834 క్వింటాళ్ల వరకు ఉంటాయని, ఏపీ సీడ్స్‌ ద్వారా, ప్రైవేటు డీలర్ల ద్వారా 2676.5 క్వింటాళ్లు విత్తనాలు రైతులకు అందు బాటులో ఉంటాయని ఆ ప్రణాళికలో పేర్కొన్నారు. ప్రధానంగా ఎంటీయూ 7029 రకం విత్తనాలు పది వేలు, ఎంటీయూ 1121 రకం విత్తనా లు 15 వేలు, ఎంటీయూ 1064 విత్తనాలు ఎనిమిది వేలు, గ్రీన్‌ మెన్యూర్‌ సీడ్‌ 275 క్వింటాళ్లలో అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలో సార్వాకు సంబంధించి మొత్తం ఎరువులు లక్షా 23 వేల 925 మెట్రిక్‌ టన్నులు అవసరమని అంచనా వేశారు. ఇందులో 53 వేల 112 టన్నుల ఎరువులు అందుబా టులో ఉన్నాయి. యూరియా 52 వేల 540 టన్నులకు గాను 31 వేల 867 టన్నులు, డీఏపీ ఎరువులు 13 వేల 408 టన్నులకు గాను 9,969 టన్నుల నిల్వలు ఉన్నాయి. ఎంవోపీ ఎరువులు 13 వేల 197 టన్నులు అవసరం కాగా 1839 టన్నులున్నాయి. కాంప్లెక్స్‌ ఎరువులు జిల్లాకు 44,780 టన్నులు అవసరం కాగా  9,437 టన్నులున్నాయి.   


ముందస్తుగా సాగునీరు

ఈ ఏడాది సార్వాకు ముందస్తుగా సాగు నీరందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏటా జూన్‌ 15న కాల్వలకు నీటి విడుదల చేస్తుండగా ఈ సారి జూన్‌ 1వ తేదీ నాటికే ఇవ్వాలని నిర్ణయించారు. వరి నారుమళ్ళు జూన్‌ నెలాఖరు నాటికి పూర్తి చేసి, జూలై 1వ తేదీ నాటికి నాట్లు పూర్తి చేయనున్నారు. గతంలో నవంబరు 2వ తేదీకి వరి కోతలు పూర్తయితే, ఈ సారి అక్టోబరు 31వ తేదీ నాటికే పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ సార్వా సీజన్‌లో 1070.4 మిల్లీ  మీటర్ల సాధారణ వర్షపాతం కాగా ఏటా 1113 మిల్లీమీటర్లు నమోదవుతుందని, సాధారణం కన్నా ఎక్కువగానే 3.08 శాతం వర్షపాతం నమోదు అవుతుందని అంచనా వేశారు. 


నారుమళ్లకు.. సిద్ధం

రబీ సాగు పూర్తి కావటంతో సార్వా వరి  నారుమళ్లు వేయటానికి రైతులు తమ పంట పొలాలను సిద్దం చేసుకుం టున్నారు. ఎండల తీవ్రత కొంత తగ్గి తొలకరి వర్షాలు కురిస్తే వరి నారుమళ్లు కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంది. బోర్లకింద సాగులో ముందస్తుగా వరి సాగు జరుగుతుందని చెబుతున్నారు.  

Updated Date - 2022-05-29T06:50:45+05:30 IST