శాతవాహన యూనివర్సిటీలో ఎలుగుబంటి కలకలం

ABN , First Publish Date - 2022-03-21T21:27:07+05:30 IST

కరీంనగర్: అడవులలో ఉండాల్సిన జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయి.

శాతవాహన యూనివర్సిటీలో ఎలుగుబంటి కలకలం

కరీంనగర్: అడవులలో ఉండాల్సిన జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఆహారాన్ని వెతుక్కుంటూ గ్రామాల్లోకి వస్తున్నాయి. ప్రతి రోజు ఇలాంటి ఘటనలు అనేక చోట్ల కనిపిస్తూనే ఉన్నాయి. కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్శిటీలోకి వచ్చిన ఎలుగుబంటి భయం ఇంకా వీడలేదు... కరీంనగర్ జిల్లాలోని శాతవాహన యూనివర్శిటీలో ఎలుగుబంటి ప్రవేశించి వారం రోజులు అవుతోంది. క్యాంపస్‌లోని సీసీ కెమెరాల్లో ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. దీంతో వర్శిటీ అధికారులు అటవీశాఖకు సమాచారం అందించారు. ఎలుగుబంటిని పట్టుకునేందుకు లేడీస్ హాస్టల్ ముందు ఒకటి. సమీప చెరువుకు కొద్ది దూరంలో మరొక ఎన్‌క్లోజర్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. ఎన్‌క్లోజర్స్‌లో ఎలుగుబంటి తినే ఆహారం ఉంచారు. అయితే అధికారులు వేసిన ప్లాన్ ఇంకా ఫలించలేదు. 2 వందల ఎకరాల విస్తీర్ణంలో ఎక్కడెక్కడ తిరుగుతుందో గానీ ఎలుగుబంటి జాడ చిక్కడంలేదు. ఎలాగైనా పట్టుకుంటామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2022-03-21T21:27:07+05:30 IST