అభివృద్ధిలో కరీంనగర్‌ ముందంజ

Published: Mon, 28 Mar 2022 00:21:27 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అభివృద్ధిలో కరీంనగర్‌ ముందంజ ఐలాండ్‌ ఏర్పాటుపై మేయర్‌ సునీల్‌రావుతో చర్చిస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌

 - నగరంలోని ఐలాండ్‌లను స్మార్ట్‌గా తీర్చిదిద్దుతాం 

- మంత్రి గంగుల కమలాకర్‌ 

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 27: అభివృద్ధిలో హైదరాబాద్‌ తర్వాత కరీంనగర్‌ ముందంజలో ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఆదివారం మేయర్‌ యాదగిరి సునీల్‌రావుతో కలిసి లోయర్‌ మానేరు డ్యాం (ఎల్‌ఎండీ) ఆనకట్టపై ఐలాండ్‌ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కమలాకర్‌ మాట్లాడుతూ కరీంనగర్‌లోని అన్ని ప్రధాన కూడళ్ల సుందరీకరణ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. కరీంనగర్‌కు ముఖద్వారమైన ఎల్‌ఎండీపై చక్కటి కూడళిని ఏర్పాటు చేస్తామని అన్నారు. రాష్ట్ర మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు చేతుల మీదుగా ఇటీవల వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నామని, ఆ పనులు పూర్తయితే కరీంనగర్‌ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని అన్నారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌ అధికారులు, స్మార్ట్‌సిటీ ప్రతినిధులు, కార్పొరేటర్లు జంగిలి ఐలేందర్‌యాదవ్‌ పాల్గొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.