CM Crying: భోరుమని ఏడ్చిన ముఖ్యమంత్రి.. అసలు సీఎం ఎందుకింత ఎమోషనల్ అయ్యారంటే..

ABN , First Publish Date - 2022-06-15T00:28:21+05:30 IST

పెంపుడు జంతువులకు, మనుషులకు ఉన్న అనుబంధాన్ని మాటల్లో వర్ణించలేం. వాటిని తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిలా చూసుకుంటారు కొందరు. వాటికి ఏమైనా జరిగితే..

CM Crying: భోరుమని ఏడ్చిన ముఖ్యమంత్రి.. అసలు సీఎం ఎందుకింత ఎమోషనల్ అయ్యారంటే..

పెంపుడు జంతువులకు, మనుషులకు ఉన్న అనుబంధాన్ని మాటల్లో వర్ణించలేం. వాటిని తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిలా చూసుకుంటారు కొందరు. వాటికి ఏమైనా జరిగితే తట్టుకోలేరు కూడా. కొన్నిసార్లయితే కన్నీళ్లు పెట్టుకుంటారు. అలాంటి ఘటనే కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మైకు ఎదురైంది. ఇటీవల ఆయన 777 చార్లీ అనే సినిమా చూశారు. పెంపుడు కుక్కతో ఒక వ్యక్తికి ఉన్న అనుబంధాన్ని ఈ సినిమాలో చక్కగా చూపించారు. అయితే సినిమా చూసిన సీఎం బొమ్మైకి చనిపోయిన తన పెంపుడు కుక్క గుర్తుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. సినిమా చూస్తూ ఉన్నంత సేపు భావోద్వేగానికి గురయ్యారట. సినిమా హాలులోనే కన్నీళ్లు పెట్టుకున్నారట.



బొమ్మై కన్నీళ్లు పెట్టుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమా చూశాక సీఎం బొమ్మై మాట్లాడుతూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కుక్కల గురించి అనేక సినిమాలు వచ్చాయి. అయితే జంతువులతో ఉండే అనుబంధం, భావోద్వేగాన్ని ఈ సినిమాలో చాలా గొప్పగా చూపించారని చెప్పుకొచ్చారు. కుక్కలది షరతులు లేని ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ అని అన్నారు. బొమ్మై వ్యక్తిగతంగా జంతు ప్రేమికులు. కుక్కలంటే ఆయనకు మహా ప్రేమ. గతేడాది ఆయన పెంపుడు కుక్క చనిపోయినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. తాజా సినిమా చూసినప్పుడు మళ్లీ తన కుక్క గుర్తుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు.

Updated Date - 2022-06-15T00:28:21+05:30 IST