Karnataka Dalit boy: 14 ఏళ్ల దళిత బాలుడిని కట్టేసి చావబాదారు.. కారణం ఏంటంటే?

ABN , First Publish Date - 2022-10-02T22:04:04+05:30 IST

దొంగతనం నేరారోపణలపై 14 ఏళ్ల దళిత బాలుడిని(Dalit boy) గ్రామస్థులు ఓ స్తంభానికి కట్టేసి చావబాదారు. చిక్కబళ్లాపుర

Karnataka Dalit boy: 14 ఏళ్ల దళిత బాలుడిని కట్టేసి చావబాదారు.. కారణం ఏంటంటే?

బెంగళూరు: దొంగతనం నేరారోపణలపై 14 ఏళ్ల దళిత బాలుడిని(Dalit boy) గ్రామస్థులు ఓ స్తంభానికి కట్టేసి చావబాదారు. చిక్కబళ్లాపుర జిల్లాలోని కెంపడెనహళ్లి గ్రామంలో జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాకెక్కి వైరల్ అవుతోంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుమార్తె డబ్బులు దొంగిలించినట్టు ఆరోపిస్తూ బాలుడి(Dalit boy)ని కట్టేసి నిర్దాక్షిణ్యంగా దాడిచేశాడు. గురువారం (సెప్టెంబరు 29) రాత్రి జరిగిందీ ఘటన. బాలుడి(Dalit boy)పై దాడిని చిత్రీకరించిన గ్రామస్థులు దానిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో నారాయణస్వామి, నవీన్, దొడ్డెగౌడ, హరీష్, అంబిక సహా మొత్తం 10 మందిని నిందితులుగా పేర్కొన్నారు.  


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో.. బాధిత బాలుడి(Dalit boy) తల్లి రత్నమ్మ మాట్లాడుతూ.. నిందితులు తమ ఇంట్లోకి చొరబడి తన కుమారుడు యశ్వంత్‌ను బయటకు ఈడ్చుకెళ్లారని పేర్కొంది. ఎందుకలా చేస్తున్నారని, ఏమైందని ప్రశ్నించిన తనపైనా దాడిచేశారని ఆరోపించింది. తన కుమారుడి(Dalit boy)ని చెప్పులతో కొట్టారని, తనను లాక్కెళ్లారని పేర్కొంది. ఆ తర్వాత వారు తమను కులం గురించి అడిగారని, చెప్పిన తర్వాత ఈ కులం వారు తమ గ్రామంలో ఉండడానికి వీల్లేదని, చంపేస్తామని హెచ్చరించారని కన్నీరు పెట్టుకుంది. కులం పేరుతో తమను దూషించారని, ఎవరూ తమను ఏమీ చేయలేరని, తమను ఎవరూ అడ్డుకోలేరని అన్నారని పేర్కొంది. 


ఈ ఘటనపై చిక్కబళ్లాపుర ఎస్పీ నగేశ్ డీఎల్ మాట్లాడుతూ.. మొత్తం 10 మంది నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. దర్యాప్తు జరుగుతున్నట్టు పేర్కొన్నారు. యశ్వంత్(Dalit boy), రత్నమ్మలను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఇటీవల ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. హిందూ దేవతా విగ్రహం వద్ద ఉన్న స్తంభాన్ని ముట్టుకున్నందుకు ఓ దళిత కుటుంబానికి గ్రామస్థులు రూ. 60 వేల జరిమానా విధించారు. 


Updated Date - 2022-10-02T22:04:04+05:30 IST