సీఎంగా యడియూరప్ప చివరి నిర్ణయం ఏమిటో తెలిస్తే...

ABN , First Publish Date - 2021-07-28T17:30:31+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ప్రకటించిన 10.25 శాతం కరువు భత్యం స్థానంలో ఆర్థిక శాఖ తాజాగా 21.5 శాతానికి పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ 1 నుం

సీఎంగా యడియూరప్ప చివరి నిర్ణయం ఏమిటో తెలిస్తే...

           - కరువు భత్యం 21.5 శాతానికి పెంపు


బెంగళూరు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ప్రకటించిన 10.25 శాతం కరువు భత్యం స్థానంలో ఆర్థిక శాఖ తాజాగా 21.5 శాతానికి పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ 1 నుంచి అమలయ్యేలా ఈ కరువుభత్యాన్ని చెల్లించనున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి కొద్ది నిమిషాల ముందు ఇందుకు సంబంధించిన ఫైల్‌పై యడియూరప్ప సంతకం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస ్థల ఉద్యోగులు, బోర్డులు, కార్పొరేషన్‌ ఉద్యోగులకు కరువు భత్యం తాజా ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రకటనలో పేర్కొన్నారు. కొవిడ్‌ కారణంగా నిలిపేసిన కరువు భత్యం పాత బకాయిలను కూడా విడుదల చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. 2020 జనవరి, జూలై, 2021 జనవరిలో చెల్లించాల్సిన కరువు భత్యాల మొత్తాలను కూడా ఉద్యోగుల జీతాలకు జమ చేయనున్నారు. కరువు భత్యం పెంపు వల్ల ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు రూ. 3 వేల నుంచి రూ 10వేల వరకు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

Updated Date - 2021-07-28T17:30:31+05:30 IST