వైద్యశాఖలో కాంట్రాక్టు సిబ్బంది సేవలు ఆరునెలల పొడిగింపు

ABN , First Publish Date - 2022-04-28T17:46:29+05:30 IST

కొవిడ్‌ క్లిష్ట సమయంలో కాంట్రాక్టు పద్దతిన వైద్యఆరోగ్యశాఖ ద్వారా నియమించుకున్న సిబ్బందికి మంత్రి సుధాకర్‌ గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఏడాదిన్నర కాలంగా

వైద్యశాఖలో కాంట్రాక్టు సిబ్బంది సేవలు ఆరునెలల పొడిగింపు

                                 - మంత్రి సుధాకర్‌


బెంగళూరు: కొవిడ్‌ క్లిష్ట సమయంలో కాంట్రాక్టు పద్దతిన వైద్యఆరోగ్యశాఖ ద్వారా నియమించుకున్న సిబ్బందికి మంత్రి సుధాకర్‌ గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఏడాదిన్నర కాలంగా పనిచేస్తున్న సిబ్బందికి మరో ఆరునెలల పాటు సేవలను పొడగిస్తున్నట్లు మంత్రి సుధాకర్‌ తెలిపారు. బెంగళూరులో బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కొవిడ్‌ కాలంలో అత్యవసర సేవల కోసం కాంట్రాక్టు పద్దతిని వివిధ విభాగాలలో పనిచేసేందుకు సిబ్బందిని నియమించుకున్నట్లు తెలిపారు. ఆర్థిక శాఖకు అనుమతుల కోసం రాశామన్నారు. అనుమతులు వస్తాయని సంకేతమిచ్చారు. దీనికి తోడు నాల్గవ విడత కొవిడ్‌ ప్రబలే అవకాశం ఉందనేది కూడా కారణమై ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Updated Date - 2022-04-28T17:46:29+05:30 IST