భారీ వర్షాలతో కర్ణాటక అతలాకుతలం

ABN , First Publish Date - 2020-08-09T09:21:52+05:30 IST

రుతుపవనాల ప్రభావంతో కర్ణాటకలోని పలు జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తోంది. నదులు పొంగిపొర్లుతూ వరద బీభత్సం సృష్టిస్తోంది. అనేక గ్రామాలు ఇప్పటికే

భారీ వర్షాలతో కర్ణాటక అతలాకుతలం

బెంగళూరు, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): రుతుపవనాల ప్రభావంతో కర్ణాటకలోని పలు జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తోంది. నదులు పొంగిపొర్లుతూ వరద బీభత్సం సృష్టిస్తోంది. అనేక గ్రామాలు ఇప్పటికే నీట మునగడంతో సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. శనివారం సాయంత్రానికి వరదల కారణంగా మొత్తం 12 మంది మృతి చెందారని ప్రభుత్వవర్గా లు వెల్లడించాయి. చిక్కమగళూరులోని చార్మాడీఘాట్‌లో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. కొడగు, చిక్కమగళూరు, దక్షిణకన్నడ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా పలు గ్రామాలు నీట మునిగాయి. మైసూరు జిల్లాలోని నంజన్‌గూడులో కబిని రిజర్వాయర్‌ నుంచి వస్తున్న వరద నేపథ్యంలో హైఅలర్ట్‌ ప్రకటించారు. ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఎం యడియూరప్ప రాష్ట్రంలో వరద పరిస్థితిని సమీక్షించారు. తక్షణ సహాయ కార్యక్రమాలు చేపట్టాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను.. సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కొండ చరియలు విరిగిపడి గల్లంతైన సంఘటనలో తలకావేరీ పూజారి సోదరుడి మృతదేహం లభించింది. మిగతా నలుగురి కోసం గాలిస్తున్నారు. వర్షాలతోపాటు నేపాల్‌ నుంచి వరద నీరు ముంచెత్తడంతో బిహార్‌ వణికిపోతోంది. కోసి, భాగమతి, కరేహ్‌, కమలాబాలన్‌, గండక్‌, బుధి గండక్‌ నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో 16జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. 73లక్షల మంది విపత్తులో చిక్కుకున్నారు.

Updated Date - 2020-08-09T09:21:52+05:30 IST