Omicron effect: 10 రోజుల నైట్ కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-12-26T20:36:48+05:30 IST

రాత్రి సమయాల్లో కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుంది. రాత్రివేళల్లో జనసమూహాలు, డీజేలు లాంటివి అనుమతి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా జనసమూహాలపై నిషేధం విధించాం. పెళ్లిల్లు, కాన్ఫరెన్స్‌లు, సభలు లాంటివి 28 నుంచి పది..

Omicron effect: 10 రోజుల నైట్ కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం

బెంగళూరు: దేశంలో కొవిడ్ కేసులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్ కొత్త వేరియంట్ ఒమైక్రాన్ కేసులు సైతం పెరుగుతున్నాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. డిసెంబర్ 28 నుంచి పది రోజుల పాటు రాత్రి వేళలో కర్ఫ్యూ విధించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఆదివారం ప్రకటించారు. అంతే కాకుండా నూతన సంవత్సర వేడుకల వేళ ఎక్కువ జనాలు ఒకచోట గుమికూడకుండా ఆంక్షలు విధించారు. దేశంలో ఒమైక్రాన్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. దీంతో కొంత కాలం పాటు ఆంక్షలు తప్పవని ఆ రాష్ట్ర అధికారులు అంటున్నారు.


‘‘రాత్రి సమయాల్లో కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుంది. రాత్రివేళల్లో జనసమూహాలు, డీజేలు లాంటివి అనుమతి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా జనసమూహాలపై నిషేధం విధించాం. పెళ్లిల్లు, కాన్ఫరెన్స్‌లు, సభలు లాంటివి 28 నుంచి పది రోజుల పాటు చేయకూడదు. హోటల్లు, పబ్బులు, రెస్టారెంట్లలో 50 శాతం కెపాసిటీతో నడిపించాలి. రాత్రి కర్ఫ్యూవేళలో అత్యవసర సేవలకు మాత్రమే బయటికి రావడానికి అనుమతి ఉంటుంది’’ అని ముఖ్యమంత్రి బొమ్మై పేర్కొన్నారు.

Updated Date - 2021-12-26T20:36:48+05:30 IST