Minister: అతివృష్టి నష్టం రూ. 600 కోట్లు

ABN , First Publish Date - 2022-08-23T17:32:46+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలవనరులశాఖకు రూ.600 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. మైసూరులో సోమవారం ఈ విషయాన్ని

Minister: అతివృష్టి నష్టం రూ. 600 కోట్లు

                         - జలవనరులశాఖ మంత్రి గోవింద కారజోళ


బెంగళూరు, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలవనరులశాఖకు రూ.600 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. మైసూరులో సోమవారం ఈ విషయాన్ని జలవనరులశాఖ మంత్రి గోవింద కారజోళ(Minister Govinda Carajola) మీడియా సమావేశంలో తెలిపారు. నైరుతి రుతుపవనాల ఆశతో పెద్దసంఖ్యలో రైతులు నాట్లు వేశారని, ఇదే సందర్భంగా దిగుబడి రెట్టింపు కావచ్చునని అంచనా వేశామని అయితే భారీ వర్షాలు ఈ ఆశలను దెబ్బతీశాయన్నారు. పలుచోట్ల చెరువుల కట్టలు తెగిపోవడం, రిజర్వాయర్‌ ప్రాంతాలు నీట మునగడంతో జలవనరులశాఖకు కోలుకోలేని దెబ్బతగిలిందన్నారు. ఇదే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. నష్టం అంచనా అధ్యయనానికి సంబంధించి కేంద్ర బృందాల రాకగురించి తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షపీడిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ప్రతిపక్షనేత సిద్దరామయ్యపై కొడగులో జరిగిన దాడిని తమ పార్టీ అగ్రనేతలంతా ఖండించారని గుర్తు చేసిన మంత్రి ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని కాంగ్రెస్ పార్టీకి సూచించారు. వచ్చే రెండు నెలల్లో స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న పౌరకార్మికుల ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేసే దిశలో ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. పౌరకార్మికుల సమస్యలు ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ఉన్నాయని, వీటన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 

Updated Date - 2022-08-23T17:32:46+05:30 IST