వారాంతపు కర్ఫ్యూలో మార్పు లేదు..

ABN , First Publish Date - 2022-01-07T18:43:54+05:30 IST

కొవిడ్‌ కేసులు పెరుగుతున్నందున రెండురోజుల కిందట ప్రకటించిన వారాంతపు కర్ఫ్యూలో ఎటువంటి మార్పులు చేయరాదని మంత్రివర్గం తీర్మానించింది. గురువారం విధానసౌధలో సీఎం బసవరాజ్‌ బొమ్మై అద్యక్షతన మంత్రివర్గ సమా

వారాంతపు కర్ఫ్యూలో మార్పు లేదు..

- అంబరీష్‌ స్మారకానికి రూ.12 కోట్లు 

- మంత్రివర్గ సమావేశంలో తీర్మానాలు


బెంగళూరు: కొవిడ్‌ కేసులు పెరుగుతున్నందున రెండురోజుల కిందట ప్రకటించిన వారాంతపు కర్ఫ్యూలో ఎటువంటి మార్పులు చేయరాదని మంత్రివర్గం తీర్మానించింది. గురువారం విధానసౌధలో సీఎం బసవరాజ్‌ బొమ్మై అద్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. తీర్మానాలను శానససభా వ్యవహారాల శాఖా మంత్రి మాధుస్వామి మీడియాకు వివరించారు. కేబినెట్‌ నిర్ణయాల్లో పలు కీలక విషయాలు ఇలా ఉన్నాయి.

- రెబల్‌స్టార్‌ అంబరీష్‌ స్మారకాన్ని కంఠీరవా స్టుడియో నిర్మాణానికి అవసరమైన 

  రూ.12 కోట్లవిడుదలకు అనుమతి. 

- ఆయుష్‌ శాఖలో ఖాళీగా ఉన్న నర్సుల పోస్టులను భర్తీకి సమావేశంలో

  మంత్రి వర్గం ఆమోదం.

- ఉడుపి జిల్లా కార్కళలో కోర్టు సముదాయ నిర్మాణాలకు రూ.19.73 కోట్ల 

 విడుదలకు అంగీకారం. 

- ‘జలజీవన్‌’ మిషన్‌ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి, పారిశుద్ద్యంకు 

 ప్రపంచ బ్యాంకు ద్వారా నిధుల సమకూర్చుకునేందుకు ఆమోదం ఇందుకు   

 రూ.9,152 కోట్లు అవసరంగా గుర్తింపు.

- మైసూరులో అంబేడ్కర్‌ భవన్‌ నిర్మాణాలకు రూ.16.50 కోట్ల కేటాయింపు. 

- బెంగళూరులో ప్రజారవాణాకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో 

 పాటు రాష్ట్ర ప్రభుత్వ కోటా నుంచి వందకోట్లతో 300ల ఎలక్ట్రికల్‌ బస్సులను  

 కొనుగోలుకు అనుమతి. 

- శివమొగ్గలోని జోగ్‌ఫాల్స్‌లో రోప్‌వేతో పాటు స్టార్‌ హోటల్‌ నిర్మాణాలకు 

  రూ.116 కోట్లకు ఆమోదం. తద్వారా జోగ్‌ఫాల్స్‌లో పర్యాటకుల సంఖ్య గణనీ

  యంగా పెరగనున్నట్లు మంత్రి తెలిపారు. 

- బెంగళూరు జలమండలి ప్రగతి పనులకై రూ.44.50 కోట్లు కేటాయింపు. 

- కోలారు జిల్లా ముళబాగిలులో కోర్టు భవనాలకు రూ.16.80 కోట్లు కేటాయింపు. 

- దొడ్డబళ్ళాపుర జిల్లాలో మారుతి ఎడ్యుకేషన్‌ సొసైటీకు 2.08 ఎకరాల భూమిని 

  రాజఘట్ట గ్రామంలో మంజూరు.

- హాసన్‌ జిల్లా చెన్నరాయపట్టణలో హీరీసావ హోబళి కబ్బళి గ్రామంలో ఆదిచుంచనగిరి మఠానికి 22.36 ఎకరాల భూమి కేటాయింపు. కాగా వీకెండ్‌ కర్ఫ్యూను కేవలం బెంగళూరుకే పరిమితం చేయాలనే ప్రతిపాదనలు కొందరు మంత్రులు ప్రస్తావించారన్నారు. అదే జరిగితే నగరానికి చెందినవారు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే అక్కడ వైరస్‌ ప్రబలే అవకాశాలు ఎక్కువని ప్రస్తుతానికి మార్పులు చేయలేమని సీఎం బసవరాజ్‌ బొమ్మై తేల్చిన మేరకు అంగీకరించారన్నారు.

Updated Date - 2022-01-07T18:43:54+05:30 IST