Ganesh festival at Idgah Maidan: ఈద్గా మైదానంలో గణేష్ ఉత్సవాలపై సుప్రీంలో వక్ఫ్‌బోర్డు పిటిషన్

ABN , First Publish Date - 2022-08-29T18:17:57+05:30 IST

ఈద్గా మైదానంలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై ముస్లిం సంస్థ(Karnataka Muslim body) వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించింది...

Ganesh festival at Idgah Maidan: ఈద్గా మైదానంలో గణేష్ ఉత్సవాలపై సుప్రీంలో వక్ఫ్‌బోర్డు పిటిషన్

బెంగళూరు(కర్ణాటక): ఈద్గా మైదానంలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై ముస్లిం సంస్థ(Karnataka Muslim body) వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించింది. బెంగళూరు నగరంలోని చామరాజుపేట(Bengaluru's Chamarajpet) ప్రాంతంలో ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి వేడుకలు నిర్వహించాలని హిందూ వినాయక ఉత్సవ మండలి నిర్ణయించింది. ఈద్గా మైదానంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు(Ganesh festival at Idgah Maidan ) కర్ణాటక హైకోర్టు(Karnataka high court order) గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ కర్ణాటక వక్ఫ్ బోర్డు(Karnataka Waqf Board) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 


ఇప్పటికే హిజాబ్ అంశం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. మరో వైపు ఈద్గా మైదానంలో గణేష్ ఉత్సవాల(Ganesh festival) నిర్వహణ అంశం కూడా సుప్రీంకు చేరింది. మొత్తంమీద బీజేపీ పాలిత బీజేపీ కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్(hijab), హలాల్(halal), ఈద్గా మైదానంలో గణేష్ ఉత్సవాల నిర్వహణ అంశాలు రెండు వర్గాల మధ్య వివాదాస్పదంగా మారాయి.


Updated Date - 2022-08-29T18:17:57+05:30 IST