పృథ్విరాజ్‌కు కర్ణిసేన వార్నింగ్‌!

May 31 2021 @ 00:02AM

అక్షయ్‌కుమార్‌ కథానాయకుడుగా నటిస్తున్న చారిత్రక చిత్రం ‘పృథ్విరాజ్‌’ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ సినిమా టైటిల్‌ సహా పలు అంశాలపై కర్ణిసేన సంస్థ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ‘‘ఈ చిత్రానికి ‘పృథ్విరాజ్‌’ అనే టైటిల్‌ను నిర్ణయించడం సమంజసం కాదు. మహారాజు పూర్తి పేరును టైటిల్‌గా పెట్టడం వల్ల ఆయన్ను గౌరవించిన ట్టు అవుతుంది. ‘పృథ్విరాజ్‌ చౌహన్‌’ అని టైటిల్‌ను మార్చాలి. అలాగే విడుదలకు ముందే ప్రత్యేక ప్రదర్శన వేసి మాకు సినిమా చూపించాలి. వారు మా సూచనలు పట్టించుకోకపోతే తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ‘పద్మావత్‌’ సమయంలో సంజయ్‌లీలా భన్సాలీకి పట్టిన గతే వారికీ పడుతుంది’’ అని క ర్ణిసేన యూత్‌ వింగ్‌ ప్రెసిడెంట్‌ సుర్జీత్‌ సింగ్‌ రాథోడ్‌ హెచ్చరించారు. ‘పృథ్విరాజ్‌’ చిత్రంలో మానుషిచిల్లర్‌ కథానాయికగా నటిస్తున్నారు. చంద్రప్రకాష్‌ ద్వివేది దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.