కరోనా హైరానా

ABN , First Publish Date - 2022-01-26T05:10:39+05:30 IST

జిల్లాలో కరోనా ఉధృతి మళ్లీ కొనసాగుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్‌లు అటు ప్రజలను, ఇటు యంత్రాంగాన్ని హైరానాకు గురి చేస్తున్నాయి.

కరోనా హైరానా
రిమ్స్‌ వద్ద కొవిడ్‌ పరీక్షల కోసం వచ్చిన బాధితులు

నిత్యం 1500కు పైగా పాజిటివ్‌లు

రిమ్స్‌కు పెరుగుతున్న బాధితులు 

9,013కు చేరిన యాక్టివ్‌ కేసులు


ఒంగోలు (కార్పొరేషన్‌), జనవరి 25 : జిల్లాలో కరోనా ఉధృతి మళ్లీ కొనసాగుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్‌లు అటు ప్రజలను, ఇటు యంత్రాంగాన్ని హైరానాకు గురి చేస్తున్నాయి. మంగళవారం కూడా 1,588 కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో రిమ్స్‌లో వైద్యం కోసం చేరే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 185 మంది బాధితులు అక్కడ చికిత్స పొందుతున్నారు. వారిని దృష్టిలో ఉంచుకుని అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. సాధారణ వైద్యం కొనసాగిస్తూనే కొవిడ్‌ సేవలందిస్తున్నారు. ప్రస్తుతం రిమ్స్‌లో 500 పడకలను ఏర్పాటు చేయగా, అవసరాన్ని బట్టి వాటిని 1600కు పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని రిమ్స్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. మరోవైపు జిల్లాలోని పట్టణ ప్రాంతాలైన మార్కాపురం, కందుకూరు, చీరాలలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకవైపు కొవిడ్‌తోపాటు సాధారణ వైద్య సేవలను అందిస్తుండగా పరిస్థితి మరీ ఇబ్బందికరంగా మారితే ఆ ప్రాం తాల్లోనూ సాధారణ వైద్య సేవలను నిలిపివేసే ఆలోచనలో యంత్రాంగం ఉన్నట్లు సమాచారం. 


కొత్తగా 1,588 పాజిటివ్‌లు.. ఒకరి మృతి

జిల్లాలో మంగళవారం కొత్తగా 1,588 కొవిడ్‌ పాజిటివ్‌లు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధి లో ఒకరు మృతి చెందారు. తాజా కేసుల్లో అత్యధికం గా ఒంగోలులో 505 ఉన్నాయి. చీరాల మండలంలో 127, వేటపాలెంలో 91, కందుకూరులో 62, పామూరులో 47, యర్రగొండపాలెంలో 45, చీమకుర్తిలో 35, పర్చూరులో 36, శింగరాయకొండలో35, వెలిగండ్లలో 35, కనిగిరిలో 33 నిర్ధారణ అయ్యాయి.నాగులుప్పలపాడులో 29,రాచర్లలో 29, సంతనూతలపాడులో 27, చిన్నగంజాంలో 25, కొనకనమిట్లలో 24, వలేటివారిపాలెంలో 23, గిద్దలూరులో 22, మార్కాపురంలో 19, మార్టూరులో 18, దర్శిలో 17, తాళ్లూరులో 17, త్రిపురాంతకంలో 17, పొదిలిలో 16, దోర్నాలలో 15, ముండ్లమూరులో 15 కేసులు వచ్చాయి. కారంచేడులో 14, కొరిశపాడులో 14, కొత్తపట్నంలో 14, పుల్లలచెరువులో 14, ఉలవపాడులో 14, పెదారవీడులో 13, టంగుటూరులో 13, అద్దంకిలో 12, బల్లికురవలో 12, పెదచోర్లోపల్లిలో 11, సి.ఎ్‌స.పురంలో  10 కేసులు వెలుగు చూశా యి.  వీటితో కలుపుకుని ఇప్పటి వరకు  1,48,233 మంది వైరస్‌ బారిన పడ్డారు. వారిలో 1,38, 087 మంది కోలుకున్నారు. 1,133 మంది మృతి చెందారు. ప్రస్తుతం 9,013 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

 

17,230 మందికి టీకాలు

ఒంగోలు (కలెక్టరేట్‌) : జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం 160 కేంద్రాల్లో 17,230 మందికి టీకాలు వేశారు. వీటితో కలిపి ఇప్పటి వరకూ 55,57,483 డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయ్యింది. 

Updated Date - 2022-01-26T05:10:39+05:30 IST