సెకండ్‌వేవ్‌ని సమర్థంగా ఎదుర్కోవాలి

ABN , First Publish Date - 2021-04-17T06:06:15+05:30 IST

గత ఏడాది కరోనాను అదుపు చేసినట్లే ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని కొవిడ్‌-19 జిల్లా ప్రత్యేకాధికారి ఉషారాణి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

సెకండ్‌వేవ్‌ని సమర్థంగా ఎదుర్కోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న కొవిడ్‌-19 ప్రత్యేకాధికారి ఉషారాణి

వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే వరకు జాగ్రత్తలు తప్పనిసరి

సమీక్షలో కొవిడ్‌-19 ప్రత్యేకాధికారి ఉషారాణి సూచన

గుంటూరు, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): గత ఏడాది కరోనాను అదుపు చేసినట్లే ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని  కొవిడ్‌-19 జిల్లా  ప్రత్యేకాధికారి ఉషారాణి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో శుక్రవారం ఆమె కరోనా కట్టడిపై సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 45 ఏళ్ల వయస్సు దాటిన వారంతా కరోనా టీకా వేయించుకుని తగిన జాగ్రత్తలు పాటిస్తూ వైరస్‌ కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాక్సినేషన్‌ పూర్తి అయ్యేంత వరకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి అని వివరించారు. మాస్కు లేనిదే బహిరంగ ప్రదేశాలకు ప్రజలను,  విద్యాసంస్థల్లోకి విద్యార్థులను అనుమతించరాదన్నారు. ంత వీలైతే అంత ఎక్కువ పడకలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సెకండ్‌ వేవ్‌లో యాక్టివ్‌ కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయని, ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే ఎక్కువ చార్జీలు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ మాట్లాడుతూ ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తులకు బెడ్ల కొరత లేకుండా చూస్తున్నామన్నారు. ఆస్పత్రుల్లో చేరిన పాజిటివ్‌ వ్యక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందజేస్తోన్నామన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితి మెడికల్‌ ఆఫీసర్‌, వైద్య సిబ్బంది పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. అవసరాన్ని బట్టి ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జేసీలు పీ ప్రశాంతి, కే శ్రీధర్‌రెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ యాస్మిన్‌, అదనపు ఎస్పీ గంగాధర్‌, నగగరపాలకసంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ, నోడల్‌ ఆఫీసర్లు కేశవరెడ్డి, ఆనంద్‌నాయక్‌, శ్రీనివాసరెడ్డి, కొండయ్య, మనోరమ, డాక్టర్‌ రవి, బాక్టర్‌ శోభారాణి పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-17T06:06:15+05:30 IST