కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు నమ్మొద్దు

ABN , First Publish Date - 2021-01-17T05:00:51+05:30 IST

కరోనా వ్యాకిన్‌పై అపో హలను నమ్మవద్దని ఎమ్మెల్యే మానుగుంట మహీ ధర్‌ రెడ్డి అన్నారు.

కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు నమ్మొద్దు

ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి

ఉలవపాడు, జనవరి 16: కరోనా వ్యాకిన్‌పై అపో హలను నమ్మవద్దని ఎమ్మెల్యే మానుగుంట మహీ ధర్‌ రెడ్డి అన్నారు. మండలంలోని చాకిచర్ల ప్రాథ మిక ఆరోగ్య కేంద్రంలో  శనివారం సిబ్బందికి వాక్సిన్‌ వేశారు.  కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లా డుతూ కరోనా వ్యాక్సిన్‌ చేయించే క్రమంలో భారత ప్రభుత్వం కట్టుదిట్టంగా కార్యక్రమం నిర్వహిస్తుం దన్నారు. అయితే, కొందరు వదంతులు, అపోహలు సృష్టిస్తున్నారని, వాటిని నమ్మొద్దన్నారు.   కలెక్టర్‌ పో లా భాస్కర్‌  ఆరోగ్య కేంద్రాన్ని సందర్సించి టీకాలు వేసే విధానాన్ని ప్యవేక్షించారు. 40 మందికి టీకాలు వేశారు.  కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో ప్రి యంవద,  సబ్‌ కలెక్టర్‌ భార్గవ్‌ తేజ, వైద్యులు రాజ్య లక్ష్మి, రమేష్‌, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

కందుకూరు: కందుకూరు ఏరియా హాస్పటల్‌లో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని శనివారం ఎమ్మెల్యే మానుగుంట మహీధర రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహీధర రెడ్డి మాట్లాడుతూ ఏరియా హాస్పటల్‌లో శిథిలస్థితికి చేరిన రమారమి 30 బెడ్లు స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయదలిచామ న్నారు. కనిగిరి మాజీఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి ఈ బెడ్లుని విరాళంగా అందిస్తామని చెప్పినందున ఆయ న ఇచ్చేవి ఉపయోగకరంగా ఉంటే స్వీకరిస్తామని చెప్పారు. లేనిపక్షంలో స్టీలు మంచాలు కొనుగోలు చేస్తామని తెలిపారు. 


సింగరాయకొండలో 55 మందికి వ్యాక్సిన్‌

సింగరాయకొండ, జనవరి 16: కరోనా నివారణకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలు దేశా నికే ఆదర్శంగా నిలిచాయని డీసీసీబీ చైర్మన్‌ మాదాసి వెంకయ్య అన్నారు. శనివారం స్థానిక ప్రా థమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కా ర్యక్రమాన్ని సబ్‌కలెక్టర్‌ భార్గవ్‌తేజ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య మా ట్లాడుతూ వ్యాక్సిన్‌ తీసుకునేవారు ఎటువంటి భ యాలకు లోనుకావద్దన్నారు. 55 మందికి వ్యాక్సిన్‌ వేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ వో వాణిశ్రీ, డాక్టర్‌ హరిత, కృష్ణచైతన్య, లహరి, సునీల్‌ గవాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.


మార్టూరులో 15 మందికి..

మార్టూరు, జనవరి 16: మార్టూరు కమ్యూనిటీ హెల్త్‌ సెంటరులో శనివారం 15 మందికి కరోనా టీ కాలు వేశారు. వీరిలో ఆసుపత్రిలో పనిచేస్తున్న వె ౖద్యులతో పా టు స్టాఫ్‌ నర్సులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులు ఉన్నారు.  మధ్యాహ్నం జాయింట్‌ కలెక్టర్‌ చేతన్‌ కేంద్రానికి వచ్చి పరిశీలించారు. ఉదయం ఆర్‌డీవో ప్రభాకరరెడ్డి, రాష్ట్ర అడిషనల్‌ డైరక్టర్‌ నీర ద, డిప్యూటీ డీఎంహెచ్‌వో మాధవీలత పరిశీ లించారు. 


చినగంజాంలో 15మందికి..

చినగంజాం, జనవరి 16: చినగంజాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న కోవిడ్‌ 6 టీకాల కా ర్యక్రమాన్ని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ కొవిడ్‌ కన్స ల్టెంట్‌ డాక్టర్‌ నరేంద్ర, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాధవీలత పరిశీలించారు. 15 మందికి వ్యాక్సిన్‌ వే సినట్టు వైద్యాధికారి విజయభాస్కరరావు తెలిపారు. 


పర్చూరులో 20 మందికి..

పర్చూరు, జనవరి 16: పర్చూరు ప్రభుత్వ వైద్యశా లలో శనివారం 20 మందికి కరోనా వ్యాక్సినేషన్‌   వేశారు.  స్థానిక వైద్యశాలలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఎన్‌.గురుమహేశ్వర్‌రెడ్డికి మొదటగా వ్యాక్సినేషన్‌ వేశారు. కార్యక్రమాన్ని డీసీ ఎంఎస్‌ చైర్మన్‌ రావి రామనాథంబాబు పర్యవేక్షిం చగా, డాక్టర్‌ శశికుమార్‌, గరికపాటి సిద్ధార్థ తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-17T05:00:51+05:30 IST