కరోనా పోరులో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2021-05-09T05:33:48+05:30 IST

కరోనా బాధితులకు అవసరమైన చికిత్స అందించడంలోనూ, టీకాలు వేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ జిల్లావ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. టీకాలు వేయండి- ప్రాణాలు కాపాడండి అంటూ నిరసనలకు టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా శనివారం పిలుపునివ్వగా జిల్లాలోని పలుప్రాంతాల్లో ఆ పార్టీశ్రేణులు నిరసనలు తెలిపారు. పర్చూరు నియోజకవర్గ పరిధిలో పలు మండలకేంద్రాలు, గ్రామాల్లో కూడా నిరసనలు జరగ్గా, ఒంగోలు, మార్కాపురం, కనిగిరి, ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ముఖ్యనేతలు ఇళ్ళు, కార్యాలయాలు వద్ద ఆందోళనలు చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలులో ఉండటంతో ఆలోపే నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో నగర టీడీపీ ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శించారు.

కరోనా పోరులో ప్రభుత్వం విఫలం
ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో నిరసన తెలుపుతున్న నాయకులు, కార్యకర్తలు

టీకాలు వేయండి.. ప్రాణాలు కాపాడండి 

నినదించిన టీడీపీ శ్రేణులు

పలుచోట్ల నిరసనలు  

ఒంగోలు, మే8 (అంధ్రజ్యోతి): కరోనా బాధితులకు అవసరమైన చికిత్స అందించడంలోనూ, టీకాలు వేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ జిల్లావ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. టీకాలు వేయండి- ప్రాణాలు కాపాడండి అంటూ నిరసనలకు టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా శనివారం పిలుపునివ్వగా జిల్లాలోని పలుప్రాంతాల్లో ఆ పార్టీశ్రేణులు నిరసనలు తెలిపారు. పర్చూరు నియోజకవర్గ పరిధిలో పలు మండలకేంద్రాలు, గ్రామాల్లో కూడా నిరసనలు జరగ్గా, ఒంగోలు, మార్కాపురం, కనిగిరి, ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ముఖ్యనేతలు ఇళ్ళు, కార్యాలయాలు వద్ద ఆందోళనలు చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలులో ఉండటంతో ఆలోపే నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో నగర టీడీపీ ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శించారు. నగర పార్టీ అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ కామేపల్లి శ్రీనివాసరావు, దర్శి టీడీపీ కోఆర్డినేటర్‌ పమిడి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. కనిగిరిలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, మార్కాపురంలో మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి నేతృత్వంలో నిరసనలు జరగ్గా దర్శిలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు పాల్గొన్నారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోను టీడీపీశ్రేణులు నిరసనలు తెలిపినట్లు సమాచారం. కాగా కొవిడ్‌ నియంత్రణ విషయంలో రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై  నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీకాలు వేయండి-ప్రాణాలు కాపాడండి అంటూ నిరసనల్లో పాల్గొన్న టీడీపీ శ్రేణులు నినదించారు. 


Updated Date - 2021-05-09T05:33:48+05:30 IST