కార్తీక కళ్లల్లో మెరుపుల్ని మళ్లీ చూడాలి....

ABN , First Publish Date - 2022-04-04T23:54:06+05:30 IST

నా జీవితంలో నేను అందుకోని, అనుభవించని ఆనందం, సంతోషం నా కూతురికి దక్కాలని కోరుకున్నాను. కానీ, నా చిట్టితల్లి చదువుకు, ఆటలకు దూరమై మెదడులో కణితి (ట్యుమర్) కారణంగా ఆస్పత్రిలో మంచం మీద పడి ఉంది. ఎంతో వేదన అనుభవిస్తోంది....

కార్తీక కళ్లల్లో మెరుపుల్ని మళ్లీ చూడాలి....

నా జీవితంలో నేను అందుకోని, అనుభవించని ఆనందం, సంతోషం నా కూతురికి దక్కాలని కోరుకున్నాను. కానీ, నా చిట్టితల్లి చదువుకు, ఆటలకు దూరమై మెదడులో కణితి (ట్యుమర్) కారణంగా ఆస్పత్రిలో మంచం మీద పడి ఉంది. ఎంతో వేదన అనుభవిస్తోంది. ఆ బాధ తనకు బదులు నాకు వచ్చి ఉండాల్సింది... ఒక తల్లిగా నా కూతురి మెరిసే కళ్ళను ఎప్పుడూ ఆనందిస్తుండేదానిని. కానీ ఒక రోజున ఆ కళ్ళల్లో మెరుపు తగ్గిపోయి తెల్లగా మారిపోవడం గమనించాను. ఇప్పుడు 11 ఏళ్ల నా కూతురు కార్తిక ఆ ట్యుమర్ కారణంగా దయనీయమైన పరిస్థితిని ఎదుర్కుంటోంది. నాకు మీ అందరి సహాయం కావాలి. డాక్టర్లు ఏదో ఒక మంచి వార్త చెప్పకపోతారా అని నేను, నా భర్త నాగదీపక్ నిస్సహాయంగా ఎదురు చూస్తున్నాం. నా బిడ్డ ఆరోగ్యం తప్ప నేను మరేదీ కోరుకోవడం లేదు.


కార్తీకను కాపాడండి... ఈ లింక్‌పై క్లిక్ చేసి సాయపడండి.


అసలు ఇదంతా ఒక తల నొప్పి సమస్యతో ప్రారంభమైంది. అది ఇంత ప్రమాదకరంగా మారుతుందని మేం ఊహించలేదు. పరీక్షలు చేసిన తర్వాత మా అమ్మాయికి Medulloblastoma - అనే బ్రెయిన్ ట్యుమర్ వచ్చిందని చెప్పారు. ఇది సాధారణంగా మా అమ్మాయి వయసున్న పిల్లలకు వస్తుందని చెప్పారు. మా అమ్మాయి కార్తీకకు మంచి వైద్యం అందించేందుకు నేను, నా భర్త మాకున్న బంగారం అంతా కుదువ పెట్టి చికిత్స కోసం హైదరాబాద్ వచ్చాం. మా పాపాయిని దక్కించుకునే అవకాశం కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధం. కానీ, ఇది చాలదు. ఆస్పత్రి బిల్లులు పెరిగిపోతున్నాయి. మా బంధువుల నుంచి అప్పులు తీసుకొచ్చినా... కార్తీక జీవితాన్ని కాపాడుకునేందుకు అతి ముఖ్యమైన సర్జరీ చేయించడానికి ఇంకా డబ్బు అవసరమవుతోంది.

సర్జరీకి అయ్యే ఖర్చు సుమారుగా రూ.6 లక్షలు (7,920 డాలర్లు)


నా భర్త నాగదీపక్ రోజంతా ఆటో రిక్షా నడుపుతూ నెలకు రూ.10 వేలు సంపాదిస్తాడు. లారీ మెకానిక్‌గా కూడా చేస్తుండే వాడు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఆ ఉద్యోగం పోయింది. నిలకడైన ఉద్యోగమనేది ఒక విలాసంగా మారిపోయింది. తన కూతురి పరిస్థితి చూసి నాగదీపం మరింత వేదన చెందుతున్నాడు... "ఒక తండ్రిగా నా కూతురికి వైద్యం అందించే బాధ్యతల్లో నేను విఫలమయ్యాను. కానీ, ఆ పరిస్థితి వల్ల నా కూతురు బతికే అవకాశాన్ని పోగొట్టుకోకుడదు. మా అమ్మాయికి ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండకూడదు" అని రోదిస్తున్నాడు.


కార్తీకను కాపాడండి... ఈ లింక్‌పై క్లిక్ చేసి సాయపడండి.


ఇప్పుడున్న ఈ దుస్థితి వల్ల మా చిన్న పాపాయి నీహారికను విజయవాడలోని మా బంధువుల దగ్గర విడిచిపెట్టాం. తన అక్కయ్య ఎప్పుడు ఇంటికి వస్తుందో తెలియక వేచి చూస్తూ రోజూ ఏడుస్తోంది. ఇప్పుడు మీ అందరి సహాయమే నా కూతురికి మరో జీవితాన్ని ఇస్తుంది. మా అమ్మాయి కళ్లలోని మెరుపులను శాశ్వతంగా ఆ విధి రాతకు వదిలేయకండి. ఒక నిరుపేద తల్లిదండ్రులుగా నా కూతురి భవిష్యత్తు కోసం మీ అందరినీ వేడుకుంటున్నాను. పెద్ద మనస్సుతో ఆర్ధిక సహాయం చెయ్యండి.

Updated Date - 2022-04-04T23:54:06+05:30 IST