సందడే.. సందడి

ABN , First Publish Date - 2021-11-29T05:19:44+05:30 IST

సందడే సందడి.. కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో వన భోజ నాలతో ఆనందంగా గడిపారు..

సందడే.. సందడి
పోడూరులో బీసీ వనసమారాధనకు హాజరైన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ

ఆనందంగా ముగిసిన చివరి కార్తీక ఆదివారం 



సందడే సందడి.. కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో వన భోజ నాలతో ఆనందంగా గడిపారు.. కుటుంబ సభ్యులు.. స్నేహితులు..కుల సం ఘాలు ఏర్పాటు చేసిన వనసమారాధనలకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. వాతా వరణం అనుకూలించడంలో మధ్యాహ్నం వరకు సందడిగా గడిపారు. చిన్నా రులు, మహిళలకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. దీంతో ఎటు చూసినా సందడి కనిపించింది. 


నరసాపురం : మండలంలోని చామకూరిపాలెంలో గౌడ, శెట్టిబలిజ, పట్ట ణంలోని వాసవీ కల్యాణ మండలంలో ఆర్యవైశ్యులు, చిట్టవరంలో గ్రామస్థులు సమారాధనలు నిర్వహించారు. ఆర్యవైశ్యలు వాసవీ మాతకు పూజలు చేశారు. చిట్టవరం మారమ్మ ఆలయంలో నిర్వహించిన సమారాధనకు వందలాది మంది పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు.పెన్సిల్‌ లీడ్‌తో గొలుసు తయారు చేసి గిన్నెస్‌ రికార్డు సాధించిన కొప్పినీడి మోహన్‌ను గ్రామస్థులు సత్కరించారు. శెట్టి బలిజ వనసమారాధనకు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, జడ్పీ చైర్మన్‌ కవురు శ్రీనువాస్‌, డీసీఎంఎస్‌ జిల్లా ఆధ్యక్షుడు వేండ్ర వెంకటస్వామి హాజరయ్యారు.


పోడూరు : గౌడశెట్టి బలిజ కులస్థులు అన్నిరంగాల్లో రాణించాలని జిల్లా గౌడశెట్టి బలిజ సమాఖ్య అధ్యక్షుడు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ వేండ్ర వెంకటస్వామి పిలుపునిచ్చారు.పోడూరులో ఆదివారం గౌడశెట్టి బలిజ వనసమారాధన నిర్వ హించారు.మహిళలకు ముగ్గులు పోటీలు, చిన్నారులకు ఆటల పోటీలు నిర్వ హించి బహమతులు అందజేశారు.మాజీ మంత్రి పితాని సత్యనారాయణ,   జడ్పీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌,మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మండల సం ఘం అధ్యక్షుడు అప్పన్నస్వామి, ఉపసర్పంచ్‌ జయరామకృష్ణ పాల్గొన్నారు.


పాలకోడేరు : గౌడ,శెట్టిబలిజలు ఐక్యంగా ఉండాలని డీసీఎంఎస్‌ చైర్మన్‌  వేండ్ర వెంకటస్వామి, విశాఖ పోర్టు చైర్మన్‌ పాకా వెంకట సత్యనారాయణ సూచించారు.గౌడ,శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనసమారాధన ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో కాగిత వెంకట శివుడు, పాలా వెంకట చలపతి, బొల్లా శ్రీనివాసు, చెల్లబోయిన పాపారావు పాల్గొన్నారు. 


యలమంచిలి : మేడపాడులో శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన నిర్వహించారు.  కాశీ నుంచి  తెచ్చిన లక్ష రుద్రాక్షలతో శివలింగాకారరం ఏర్పాటు చేసి రుద్రాభిషేకాలు చేశారు. సంఘ జిల్లా అధ్యక్షుడు గోటేటి ఫణిబాబా, కృత్తివెంటి భానుమూర్తి, గోటేటి వెంకటేశ్వరరావు, అన్నాజీరావు, కేవీఎస్‌ సుబ్బారావు పర్యవేక్షించారు.


ఆకివీడు : వనభోజనాలతో స్నేహభావం పెంపొందుతుందని ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు.వీరభద్ర వీవర్స్‌ కమ్యూనిటీ హాల్‌లో పద్మశాలీల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వనసమారాధన నిర్వహించారు. కార్య క్రమంలో కౌన్సిలర్‌ బత్తుల శ్యామల, బళ్ళ ప్రసాద్‌, చల్లా శివన్నారాయణ, శలా భాస్కరరావు, వాసా శ్రీను, బత్తుల రవి ఉన్నారు.మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి దేవస్థానం ఆర్యవైశ్య కల్యాణ మందిరంలో అన్నసమారాధన చేశారు.


భీమవరం రూరల్‌/అర్బన్‌ : భీమవరం గునుపూడి, వాసవీక్లబ్‌ వారి ఆధ్వర్యంలో పట్టణ శివారు ఆశ్రమం తోటలో కార్తీక వనసమారాధన చేశారు. దీనిలో భాగంగా కార్తీక దామోదర పూజ, సత్యనారాయణస్వామి వ్రతం, ఉసిరి పూజ, గోమాత పూజలు నిర్వహించారు. బేతపూడి రామాలయంలో ఉసిరి చెట్టు కింద ప్రత్యేక పూజలు చేసి వన భోజనాలను ప్రసాదంగా అందించారు.ఈ కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షుడు చెక్క శ్రీనివాస్‌, కార్యదర్శి ఉప్పల నరసింహమూర్తి, ఉపాధ్యక్షుడు గమిని రవి, పంపన కుమార్‌ పాల్గొన్నారు. 


మొగల్తూరు : గాయత్రీ బ్రాహ్మణ సమాఖ్య ఆద్వర్యంలో శిష్టా సీతా రామయ్య గారి ప్రాంగణంలో, ఆర్యవైశ్యుల వన సమారాధనను తుంపూడి మల్లే శ్వరరావుగారి తోటలోనూ కార్తీక వన సమారాధనలు ఆదివారం మొగల్తూరులో ఘనంగా నిర్వహించారు. మహిళలు వాసవీమాతకు ప్రత్యేక పూజలు చేశారు.  


పెనుగొండ : వన సమారాధనల వల్ల ఒకరి పట్ల ఒకరికి మంచి స్నేహబంధం అలవడుతుందని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. ఆదివారం పెనుగొండలో ఆర్యవైశ్య కార్తీక వన సమారాధన నిర్వహించారు.   చిట్టూరి వారి సంఘం ఆధ్వర్యంలోనూ  వన సమారాధన ఏర్పాటు చేశారు.


ఆచంట :  మండలంలో  వన సమారాధనలు వేడుకగా జరిగాయి. ఆచంట లో  శెటి ్టబలిజ వర్తక సంఘం, కొడమంచిలిలో కాపు సంఘం, వేమవరంలో శెట్టిబలిజ సంఘాల ఆఽధ్వర్యంలో వన భోజనాలు నిర్వహించారు. 


పెనుమంట్ర : మీ అందరి అభిమానం పొందినందుకు చాలా సంతోషంగా ఉందని నగరి ఎమ్మెల్యే ఆర్‌కే.రోజా అన్నారు. మార్టేరు రెడ్డి కల్యాణ మండపంలో రెడ్డి కార్తీక సమారాధనకు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కర్రి గౌరీ సుభాషిణి వేణుబాబు, ఎంపీపీ కర్రి వెంకట నారాయణరెడ్డి, ఎంపీటీసీ లక్ష్మణరెడ్డి, అనూరాధ, అల్లం భాస్కరరెడ్డి, పాలసత్తి రామిరెడ్డి పాల్గొన్నారు. 


పాలకొల్లు రూరల్‌ : కాపులు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు అన్నారు. కార్తీక మాసం సందర్భంగా పట్టణ యునైటెడ్‌ కాపు క్లబ్‌ కుటుంబ సభ్యులు, ఆత్మీయ సమ్మేళనాన్ని పెనుమదం రోడ్డులో ఆదివారం నిర్వహించారు.క్లబ్‌ గవర్నర్‌ డాక్టర్‌ ముచ్చర్ల సంజయ్‌, యడ్ల తాతాజీ, వల్లభు నారాయణమూర్తి, గుణ్ణం విశ్వేశ్వరరావు, కఠారి నాగేంద్ర కుమార్‌, చేగొండి సూర్య ప్రకాష్‌ పాల్గొన్నారు. దగ్గులూరులో రజక సంఘం ఆధ్వర్యంలో మండల రజక సంఘ కార్తీక వన భోజనాలు నిర్వహించారు.వెలివెల సర్పంచ్‌ కెల్లా సింహాచలం, సంఘాధ్యక్షుడు ఆదుర్తి శివ రావు,కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు,దేవాడ నీల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 


పాలకొల్లు  అర్బన్‌ : పట్టణంలో పలు కుల సంఘాల ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధనలు నిర్వహించారు. ఏఎంసీ ఆవరణలో శ్రీ కృష్ణ యాదవ సం క్షేమ సంఘం, పూలపల్లి బైపాస్‌ వద్ద తూర్పు కాపు  సంఘం, పెంకుళ్ళ పాడు వద్ద తోటలో తెలికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వనసమారాధనలు జరిగాయి.ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ సమాజంలో అన్ని కులాల వారు అభివృద్ధి చెందాలన్నారు. తూర్పుకాపు సంఘం నాయకులు ముందుగా దేశాలమ్మ గుడి వద్ద నుంచి ర్యాలీగా బయలు దేరి డాక్టర్‌ గమిడి సూర్యారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 



Updated Date - 2021-11-29T05:19:44+05:30 IST