కార్తీక శోభ

ABN , First Publish Date - 2020-11-30T04:50:45+05:30 IST

జిల్లాలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. కార్తీకపౌర్ణమి పర్వదినాన్ని జిల్లా ప్రజలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. శివాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం వేళ.. మహిళలు నోములు నోచారు.

కార్తీక శోభ
బాహుదా నదిలో కార్తీక దీపాలు వదులుతున్న మహిళలు




వైభవంగా పౌర్ణమి 

(ఇచ్ఛాపురం/జలుమూరు/గుజరాతీపేట, నవంబరు 29)

జిల్లాలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. కార్తీకపౌర్ణమి పర్వదినాన్ని జిల్లా ప్రజలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. శివాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.  సాయంత్రం వేళ.. మహిళలు నోములు నోచారు. ఇళ్ల వద్ద, ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగించారు. జలుమూరు మండలంలో శ్రీముఖలింగేశ్వర స్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. పౌర్ణమిని పురస్కరించుకుని రాత్రివేళ ఆలయ శిఖర దీపాన్ని వెలిగించి.. జ్వాలాతోరణం వేలాడదీశారు. ఇచ్ఛాపురం పట్టణ ప్రజలు బాహుదానదిలో స్నానాలాచరించారు.  నదిలో కార్తీకదీపాలు వదిలారు. పాతాళసిద్దేశ్వరాలయం, చిదంబరేశ్వర, నర్మదేశ్వర, కాశీవిశ్వనాధ, తారకేశ్వర, చంద్రశేఖర, నీలకంఠేశ్వర, ఉమామహేశ్వర, రత్నేశ్వర, ఆలయాల్లో భక్తులు బారులుతీరారు. శ్రీకాకుళంలోని  నాగావళి నదిలో కూడా మహిళలు రాత్రి వేళ.. కార్తీక దీపాలు విడిచిపెట్టారు.  





Updated Date - 2020-11-30T04:50:45+05:30 IST