ప్రేమ, యాక్షన్‌ల సమ్మిళితమే ‘కార్తికేయ 2’

ABN , First Publish Date - 2022-08-09T05:30:00+05:30 IST

శ్రీకృష్ణుని ద్వారకా ఇతివృత్తంగా కార్తికేయ 2 చిత్రం తెరకెక్కినట్టు చిత్ర హీరో నిఖిల్‌ అన్నారు.చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మంగళవారం సంగం శరత్‌ థియేటర్‌లో సందడి చేశారు. ముందుగా చిత్ర ట్రైలర్‌ను ప్రదర్శించారు

ప్రేమ, యాక్షన్‌ల సమ్మిళితమే ‘కార్తికేయ 2’
సంగం థియేటర్‌లో హీరో నిఖిల్‌, హీరోయిన్‌ అనుపమ

డాబాగార్డెన్స్‌, ఆగస్టు 9 : శ్రీకృష్ణుని ద్వారకా ఇతివృత్తంగా కార్తికేయ 2 చిత్రం తెరకెక్కినట్టు చిత్ర హీరో నిఖిల్‌ అన్నారు.చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మంగళవారం సంగం శరత్‌ థియేటర్‌లో సందడి చేశారు. ముందుగా చిత్ర ట్రైలర్‌ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిత్ర హీరో మాట్లాడుతూ సాంకేతికపరంగా అద్భుతమైన విజువల్స్‌, ఎమోషన్స్‌, ప్రేమ, యాక్షన్‌లతో చిత్రం రూపొందిందని అన్నారు. ఈ నెల 13న చిత్రం విడుదల అవుతుందన్నారు. హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ మాట్లాడుతూ కార్తికేయ 2 చిత్రం తనకు ప్రత్యేకమన్నారు. ప్రేక్షకులు సినిమా చూసినంత సేపు తరువాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠకు గురవుతారని అన్నారు. చిత్ర నటులు శ్రీనివాస రెడ్డి, హర్షలు మాట్లాడుతూ మంచి చిత్రంలో తాము నటించడం ఆనందంగా ఉందన్నారు.


Updated Date - 2022-08-09T05:30:00+05:30 IST