Karti Chidambaram: ఆజాద్‌ వెళ్లడం పార్టీకి లోటే...!

ABN , First Publish Date - 2022-09-08T16:16:51+05:30 IST

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ పార్టీని వీడడం లోటేనని ఆ పార్టీ ఎంపీ కార్తీ చిదంబరం(MP Karti Chidambaram) అభిప్రాయపడ్డారు

Karti Chidambaram: ఆజాద్‌ వెళ్లడం పార్టీకి లోటే...!

                                 - ఎంపీ కార్తీ చిదంబరం


పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 7: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ పార్టీని వీడడం లోటేనని ఆ పార్టీ ఎంపీ కార్తీ చిదంబరం(MP Karti Chidambaram) అభిప్రాయపడ్డారు. శివగంగ జిల్లా కారైకుడిలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... గులాంనబీ ఆజాద్‌ వైదొలుగుతూ పార్టీపై ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ పోటీ చేస్తే మరెవరూ ఆయనకు పోటీగా నిలబడే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - 2022-09-08T16:16:51+05:30 IST