Viral Video: చిన్న పిల్లోడితో కలిసి Bhool Bhulaiyaa 2 ప్రమోషనల్ వీడియో చేసిన Kartik Aaryan.. నవ్వాపుకోలేకపోతున్న ఫ్యాన్స్

Published: Tue, 17 May 2022 10:32:03 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Viral Video: చిన్న పిల్లోడితో కలిసి Bhool Bhulaiyaa 2 ప్రమోషనల్ వీడియో చేసిన Kartik Aaryan.. నవ్వాపుకోలేకపోతున్న ఫ్యాన్స్

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న నటుల్లో కార్తీక్ ఆర్యన్ ఒకరు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ యువ నటుడు నటించిన తాజా చిత్రం ‘భుల్ భూలయ్యా 2’. ఈ మూవీ మే 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్‌ని చిత్రబృందం జోరుగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా కార్తీక్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నవ్వులు పూయిస్తోంది.


సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కార్తీక్ ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అందులో ఇప్పటికే వైరల్ అయిన ఓ చిన్న పిల్లోడు ఫోన్ మాట్లాడే వీడియోకి సింక్ అయ్యేలా ఈ నటుడు వీడియో చేశాడు. అందులో కుటుంబంతో కలిసి థియేటర్‌‌కి వెళ్లి తన సినిమాని చూడమని కార్తీక్ ఆ బేబీతో అంటాడు. అలాగే థియేటర్‌లో ఏడవకూడదు, అల్లరి చేయకూడదని అంటాడు. దానికి తగినట్లు ఆ బెబీ సైతం నవ్వుతున్నట్లు, ఊ కొడుతున్నట్లు బాగా సింక్ అయ్యింది. ఈ వీడియో వైరల్‌గా మారడంతో ఎంతోమంది కార్తీక్ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అందులో.. కొందరైతే తాము నవ్వాపుకోలకే పోయామని, వీడియో చూసినంతసేపు నవ్వుతూనే ఉన్నామని రాసుకొచ్చారు. మరికొందరు లవ్ లీ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉందని కామెంట్స్ చేశారు. ఆ ఫన్నీ వీడియోపై మీరు ఓ లుక్కేసి ఎంజాయ్ చేయండి..


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...