ఆ అప్పునే మా ప్రభుత్వం తీరుస్తోంది: మంత్రి కారుమూరి

Published: Tue, 28 Jun 2022 19:32:52 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆ అప్పునే మా ప్రభుత్వం తీరుస్తోంది: మంత్రి కారుమూరి

అమరావతి: ఏపీ ఎక్కువ అప్పులు చేస్తోందంటూ టీడీపీ అల్లరి చేస్తుందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ కంటే పక్క రాష్ట్రాలు ఎక్కువ అప్పులు తీసుకున్నాయన్నారు. కార్పొరేషన్‌ డబ్బును పసుపు-కుంకుమకి చంద్రబాబు ఖర్చుచేశారని ఆరోపించారు. ఆ అప్పును తమ ప్రభుత్వం తీరుస్తోందని మంత్రి పేర్కొన్నారు. రైతులకు రూ.2 వేల కోట్ల ధాన్యం డబ్బులు విడదల చేశామన్నారు. రేపటికల్లా రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందన్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.