Karunanidhi విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2022-05-07T16:16:56+05:30 IST

దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 98వ జయంతిని పురస్కరించుకుని స్థానిక ఓమందూర్‌ ఎస్టేట్‌లో 16 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Karunanidhi విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ఉపరాష్ట్రపతి

ఐసిఎఫ్‌(చెన్నై): దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 98వ జయంతిని పురస్కరించుకుని స్థానిక ఓమందూర్‌ ఎస్టేట్‌లో 16 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించనున్నారు. జూన్‌ 3వ తేదీ ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలిసారిగా కరుణానిధి జయంతి వేడుకలు జరుగనున్నాయి. ఓమందూర్‌ ఎస్టేట్‌లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విగ్రహం తయారీ పనులు ప్రస్తుతం తిరువళ్లూర్‌ జిల్లా మీంజూరులో జరుగుతున్నాయి. కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఉపరాష్ట్రపతిని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆహ్వానించారు. ఇటీవల వెంకయ్యనాయుడిని ఆయన చెన్నైలోని గృహంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌, మంత్రి దురైమురుగన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైఅన్బు కలుసుకున్నారు. కరుణానిధి విగ్రహం పీఠం అమర్చేందుకు గ్రానైట్‌ రాళ్లు ఎంపిక చేసేందుకు అధికారులు జైపూర్‌ వెళ్లారు. విగ్రహ తయారీ పనులు 15 రోజుల్లో పూర్తికానున్నాయి.

Read more