హైదరాబాద్ కార్వీ కేసులో మరో ఇద్దరి అరెస్ట్

ABN , First Publish Date - 2021-09-02T23:21:53+05:30 IST

హైదరాబాద్ కార్వీ కేసులో మరో ఇద్దరి అరెస్ట్

హైదరాబాద్ కార్వీ కేసులో మరో ఇద్దరి అరెస్ట్

హైదరాబాద్‌: కార్వీ కేసులో మరో ఇద్దరిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజీవ్ రంజాన్ సింగ్‌తో పాటు హరికృష్ణ‌లను నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు నకిలీ షెల్ కంపెనీలతో మోసానికి పాల్పడ్డారు. 9 నకిలీ షెల్ కంపెనీలతో రూ. 600 కోట్ల ట్రేడింగ్ జరిగింది. కార్వీ ఎండీ పార్థసారధి ఆదేశాలతో షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారు. రూ. 300 కోట్ల వరకు నష్టం చూపెట్టారు. ఈ కేసులో నిందితులిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


కాగా ఈ కేసు నిందితులు 2014 నుంచి షెల్ కంపెనీలు నడుపుతున్నారు. ఛాంపియన్ ఇన్సూరెన్స్, బై లార్జ్ ఇన్సూరెన్స్, క్లాసిక్ ఇన్సూరెన్స్, జన్నత్ ఇన్సూరెన్స్, నోవా హెల్త్ కేర్, కార్వి కన్సల్టెన్సీ ఇన్సూరెన్స్, దిస్ గార్డ్ ఇన్సూరెన్స్, విటా లివింగ్ అడ్వాన్స్, టెలికాం హెల్త్ కేర్ పేర్లతో షెల్ కంపెనీలను నడిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. 


Updated Date - 2021-09-02T23:21:53+05:30 IST