Hajj యాత్రికులకు హారతి పట్టిన Kashmir Hindus

ABN , First Publish Date - 2022-07-16T23:43:29+05:30 IST

సౌదీ అరేబియాలోని మక్కాను దర్శించుకుని తిరిగి వచ్చిన హజ్ యాత్రికుల బృందానికి స్థానిక కశ్మీరీ హిందువులు హారతి పట్టి ..

Hajj యాత్రికులకు హారతి పట్టిన Kashmir Hindus

శ్రీనగర్: సౌదీ అరేబియాలోని మక్కాను దర్శించుకుని తిరిగి వచ్చిన హజ్ (Hajj) యాత్రికుల  బృందానికి స్థానిక కశ్మీరీ హిందువులు (Kashmir Hindus) హారతి పట్టి సాదర స్వాగతం (Welcome) పలికారు. ఇస్లామిక్ సంప్రదాయ గీతాన్ని ఆలపిస్తూ, కరచాలనం చేస్తూ, రోజా పువ్వులు అందిస్తూ పరస్పర ఐక్యమత్యం, సోదరభావం ప్రకటించుకున్నారు. శ్రీనగర్ విమానాశ్రయంలో హజ్ యాత్రికులకు సాదర స్వాగతం పలుకుతున్న వీడియో క్లిప్‌ను ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే అబ్బాస్ బిన్ ముఖ్తార్ అన్సారి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.


''హజ్ యాత్రను ముగించుకుని తిరిగివచ్చిన యాత్రికులు శ్రీనగర్ విమానాశ్రయం వెలుపలకి రాగానే అక్కడ వేచిచూస్తున్న కశ్మీరీ పండిట్ సోదరులు సాదర స్వాగతం పలికారు. హారతి ఇచ్చి, మహమ్మద్ ప్రవక్తను కీర్తించే 'నాట్' గీతం పాడుతూ అభినందనలు తెలియజేశారు. వీరి ప్రేమ రాజకీయ దుష్ట శక్తుల కళ్లలో పడకూడదని ఆశిస్తున్నాను'' అని అన్సారి ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2022-07-16T23:43:29+05:30 IST