కటారి హేమలత మాటలు అవాస్తవం: SP రిశాంత్ రెడ్డి

ABN , First Publish Date - 2022-06-25T01:42:54+05:30 IST

చిత్తూరు: చిత్తూరు మాజీ మేయర్ కటారి హేమలత గాయపడ్డ ఘటనపై జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి స్పందించారు. కటారి హేమలత అనుచరుడు పూర్ణను అరెస్టు చేసే సమయంలో పోలీసులు,

కటారి హేమలత మాటలు అవాస్తవం: SP రిశాంత్ రెడ్డి

చిత్తూరు: చిత్తూరు మాజీ మేయర్ కటారి హేమలత గాయపడ్డ ఘటనపై జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి స్పందించారు. కటారి హేమలత అనుచరుడు పూర్ణను అరెస్టు చేసే సమయంలో పోలీసులు, కటారి వర్గీయులకు మధ్య తోపులాట జరిగింది. 

     

     ‘‘గంజాయి కలిగి ఉన్నాడన్న పక్కా సమాచారంతోనే పూర్ణను అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో కటారి కుటుంబ సభ్యులు పోలీసులను అడ్డుకోడానికి ప్రయత్నించారు. నిందితుడు పూర్ణను కాపాడేందుకు వారు పోలీసు విధులకు ఆటంకం కలిగించి గొడవకు దిగారు. ఈ క్రమంలోనే మాజీ మేయర్ కటారి హేమలత కింద పడి స్వల్పంగా గాయపడ్డారు. పోలీసు వాహనం కూడా  డ్యామేజ్ అయ్యింది. కావాలని హేమలతపై పోలీసులు వాహనాన్ని ఎక్కించలేదు.  పోలీసులు వాహనాన్ని ఎక్కించి హత్యాయత్నానికి పాల్పడ్డారన్నది అవాస్తవం. మేయర్ దంపతుల హత్య కేసులో సాక్షులకు రక్షణ కల్పిస్తాం. ఏ‌ఎస్పీ స్థాయి అధికారిని నియమించి ఈ ఘటనపై విచారణ జరిపిస్తాం. ఈ ఘటనలో రెండు కేసులు నమోదు చేశాం. గంజాయి కేసు నమోదు ఒకటి. పోలీసు విధులకు ఆటంకం కల్పించడంపై మరో కేసు నమోదు చేశాం.’’ అని ఎస్పీ రిశాంత్ రెడ్డి వివరించారు.


Updated Date - 2022-06-25T01:42:54+05:30 IST